అధిక పింఛన్ లో ఈపీఎఫ్ఓ భారీ కోత !

Telugu Lo Computer
0


ధిక పింఛన్ అర్హత లేని ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు వర్తింపజేస్తున్నటువంటి లెక్కింపు విధానాన్నే ఇప్పుడు అధిక పింఛన్ అర్హులకు అమలు చేస్తామని ఈపీఎఫ్ఓ తెలిపింది. ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ నిబంధనల ప్రకారం 2014 సెప్టెంబర్ కంటే ముందు సర్వీసుకు పార్ట్ 1 సెప్టెంబర్ తర్వాత రిటైర్మెంట్ వరకు పార్ట్ 2 కింద లెక్కించి తుది పెన్షన్ ఖరారు చేయనుంది. కార్మిక మంత్రిత్వ శాఖ కూడా ఈ విధానానికి ఆమోదం తెలిపినట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది. ఈ మేరకు ఈపీఎఫ్ఓ హైయ్యర్ పెన్షన్ విభాగం అదనపు కేంద్ర భవిష్యనిధి కమిషనర్ చంద్రమౌళి చక్రవర్తి దీనిపై ఆదేశాలు జారీ చేశారు. పార్ట్ 1, పార్ట్ 2 కింద లెక్కించడంతో ఇప్పుడు 30 శాతానికి పింఛనులో కోతపడుతుంది. గరిష్టవేతన పరిమితి రూ. 6,500 నుంచి 15వేలకు పెంచిన సమయంలో ఈపీఎఫ్ఓ ఈ నిబంధనను తీసుకువచ్చింది. 2014 సెప్టెంబర్ 1కి ముందు చివరి ఏడాది సగటు వేతనం మొత్తం సర్వీస్ కలిపి పెన్షన్ లెక్కించే విధానం అమల్లో ఉండేది. ఇక గరిష్ట వేతన పరిమితి పెంచిన తర్వాత ఆఖరి ఐదేళ్ల సగటు వేతనం తీసుకుని లెక్కించేలా సవరణలు చేసింది. అయితే పెన్షన్ ఫండ్ కు నగదు జమ చేస్తున్నప్పుడు గరిష్ట వేతన పరిమితి ప్రస్తావనలేదు. ఇలా పార్ట్ 1,2 అని కాకుండా 2014 సెప్టెంబర్ కు ముందున్న నిబంధనే అమలు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తుయి. ఉదాహరణకు ప్రభుత్వ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగి 1999లో సర్వీసులో చేరి 2021లో రిటైర్ అయ్యారనుకుంటే బోనస్ రెండేళ్లలో కలిపి మొత్తం సర్వీస్ కాలం 24 ఏళ్లు అవుతుంది. ఇక 2014 వరకు సగటు వార్షిక వేతనం రూ. 22వేలు ఉంటే రిటైర్మెంట్ సమయంలో చివరి ఐదేళ్ల సగటు వేతనం రూ. 40వేలు ఉంటుంది. ఈ లెక్కన చివరి 5ఏళ్ల వేతన సగటుతో పింఛన్ రూ. 13,714 అందాలి. అయితే పార్ట్ 1, 2 కింద లెక్కించడంతో పార్ట్ 1 కింద రూ. 5342, పార్ట్ 2 కింద రూ. 4వేలు ఇలా మొత్తం రూ. 9342 మాత్రమే అవుతుంది. నెలకు దాదాపు రూ. 4372మేర కోత పడుతుంది. పింఛన్ లెక్కించేందుకు ఒక ఫార్మూలా ఉంది. వేతన సగటున సర్వీస్ కాలంతో గుణించి దానిని 70తో భాగించాలి. దీన్ని బట్టి పెన్షన్ లెక్కిస్తుంటారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)