స్కోడా కాంపాక్ట్ ఎస్‌యూవీ కైలాక్ !

Telugu Lo Computer
0


స్కోడా కైలాక్ లో 1.0-లీటర్ 3-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ అందించారు. ఇది 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో వస్తుంది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో ఒక లీటర్ పెట్రోల్‌పై కయాక్ 19.05 కి.మీలను అందజేస్తుందని ARAI ధృవీకరించింది.ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో 19.68 కి.మీ. వరకు మైలేజీని ఇస్తుంది. స్కోడా కైలక్ ఎస్‌యూవీ భారతీయ మార్కెట్లో ఉన్న ఇతర కాంపాక్ట్ ఎస్‌యూవీలతో పోల్చినప్పుడు ఇది చాలా కార్ల కంటే మెరుగ్గా ఉంది. టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మారుతి సుజుకి బ్రెజ్జాతో పోలిస్తే, స్కొడా కైలక్ యొక్క మాన్యువల్ వెర్షన్ ఎక్కువ మైలేజీని ఇవ్వగలదు. అయితే.. స్కోడా కైలాక్ ఆటోమేటిక్ కంటే బ్రెజ్జా ఆటోమేటిక్ మోడల్ మాత్రం ఎక్కువ మైలేజీని ఇస్తుంది. ఈ ఎస్​యూవీలో డిజిటల్ ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1-ఇంచ్​ టచ్​స్క్రీన్ ఇన్ఫోటైన్​మెంట్ సిస్టమ్​తో వస్తుంది. ఇది వైర్​లెస్ యాపిల్ కార్​ప్లే, ఆండ్రాయిడ్ ఆటోను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫీచర్లు టాప్​ 2 ట్రిమ్ స్థాయిలతో మాత్రమే అందుబాటులో ఉండగా, మిడ్ స్పెక్ సిగ్నేచర్ వేరియంట్ 5 ఇంచ్​ టచ్​స్క్రీన్​, సెమీ-డిజిటల్ ఇన్​స్ట్రు మెంట్ ప్యానెల్​ని పొందుతుంది. బేస్ క్లాసిక్ వేరియంట్ అనలాగ్ ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్​ని పొందుతుంది. కైలాక్ ప్రెస్టీజ్​లో వెంటిలేషన్​తో కూడిన 6-వే పవర్ అడ్జెస్టెబుల్ ఫ్రంట్ సీట్లు కూడా ఉన్నాయి. ఆసక్తికరంగా, ప్రతి వేరియంట్ సింగిల్ లేదా డ్యూయల్ టోన్​లో ప్రత్యేకమైన క్యాబిన్ అప్​హోలిస్ట్రీని పొందుతుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)