మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఈ-రిక్షాలు విరివిగా వాడుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు నడవాలంటే ఛార్జింగ్ తప్పనిసరి. బయటికి వెళ్లినపుడు దారి మధ్యలో పెట్రోల్ అయిపోతే పెట్రోల్ బంక్‌కు ఎలా వెళతారో ఈవీల్లో ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ పెట్టుకునేందుకు ఓ పవర్ స్టేషన్ తప్పనిసరిగా అవసరం పడుతుంది. అదే ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్. రోడ్డు పక్కన ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభిస్తే కాసులు కురవటం ఖాయం. ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటుకు 50 నుండి 100 చదరపు గజాల ఖాళీ ప్లాట్ ఉంటే చాలు. ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలనే ఆసక్తి ఉంటే కొన్ని అనుమతులు తప్పనిసరి. మున్సిపల్ కార్పొరేషన్, అగ్నిమాపక శాఖ,అటవీ శాఖల నుంచి ఎన్ఓసీ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఛార్జింగ్ స్టేషన్‌లో కొన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. వాహనాల పార్కింగ్, రాకపోకలకు కోసం తగినంత స్థలం ఉండేలా చూసుకోవాలి. త్రాగునీరు, రెస్ట్ రూం, అగ్నిమాపక యంత్రం, వెంటిలేషన్, వాష్ రూం వంటి ప్రాథమిక సౌకర్యాలు కచ్చితంగా అందుబాటులో ఉంచాలి. సామర్థ్యాన్ని బట్టి EV ఛార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటుకు 40 లక్షలు లేదా అంతకంటే తక్కువే ఖర్చవుతుంది. మినిమం కెపాసిటీ ఉన్న ఛార్జింగ్ స్టేషన్ ఇన్‌స్టాల్ చేస్తే రూ.15 లక్షల వరకూ పెట్టుబడి పెట్టాల్సి రావచ్చు. ఉదాహరణకు 4000 KW ఛార్జింగ్ స్టేషన్‌ను ఇన్‌స్టాల్ చేశారని అనుకుందాం. మామూలుగా ప్రతి కిలోవాట్‌కి 2.5రూపాయలు వస్తుంది. ఈ లెక్కన ఒక్క రోజులో రూ.10,000లు ఈజీగా సంపాదించవచ్చు. అదే నెలలో అయితే రూ.3లక్షల వరకూ వస్తుంది. అన్ని ఖర్చులూ పోగా రూ.2 లక్షలు సంపాదించవచ్చు. EV ఛార్జింగ్ స్టేషన్ సామర్థ్యం ఎంతుంది అనే దానిపైనే ఆదాయం ఆధారపడి ఉంటుంది.
ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ వ్యాపారం - లాభాలు !
January 19, 2025
0
Tags