ఉత్తర ద్వారాలు తెరిచిన పది రోజుల్లో 7.20 లక్షల మందికి శ్రీవారి దర్శన భాగ్యం !

Telugu Lo Computer
0

తిరుమలలో ఉత్తర ద్వారాలు తెరిచిన పది రోజుల్లో 7.20 లక్షల మందికి శ్రీవారిని ప్రత్యేక ద్వారాల ద్వారా వెళ్లి దర్శించుకునే అవకాశం లభించింది. ఈసారి ఆన్‌లైన్‌లో 4.35 లక్షల టోకెన్లు ఇచ్చారు. అలాగే ఆన్‌లైన్‌లో ఎస్ఈడీ టికెట్లు 1.40 లక్షలు ఇచ్చారు. శ్రీవాణి బ్రేక్ దర్శనాలు 19,500 ఉన్నాయి. దాతలు 8,000 మంది, ప్రోటోకాల్ ప్రముఖులు 65వేల మంది దాకా దర్శనాలు చేసుకున్నారు. ఇక ఇవాళ అర్థరాత్రి ఉత్తర ద్వారాలను మూసివేస్తారు. రేపటి నుంచి సర్వ దర్శనాలు కొనసాగుతాయి. 9 రోజుల ఉత్తర ద్వార దర్శనాల్లో హుండీ ఆదాయం రూ.27.50 కోట్లకు చేరింది. ఇవాళ మరో రూ.3 కోట్లకు పైగానే వచ్చే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్ లోని  ప్రయాగరాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో శ్రీనివాస కల్యణం నిర్వహించారు. అక్కడి శ్రీవారి నమూనా ఆలయంలో ఈ పెళ్లి వేడుకలు జరిగాయి. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల సమయంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)