జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయాన్ని ప్రారంభించిన అమిత్ షా !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా, గన్నవరం మండలంలోని కొండపావులూరులో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. కార్యాలయ ప్రాంగణంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో కలిసి మొక్కలు నాటారు. ఎన్డీఆర్ఎఫ్ వేడుకల్లో పాల్గొన్న ఆయన 10వ బెటాలియన్‌ని ప్రారంభించారు. అలాగే తిరుపతిలో ఫోరెన్సిక్ ల్యాబ్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. గత ఆరు నెలలుగా రాష్ట్రానికి అందించిన సహకారానికి కేంద్రానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ 18వేలకు పైగా రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహించిందని ఆయన మెచ్చుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ కొన్ని లక్షల మంది ప్రాణాలను కాపాడారనీ విదేశాల్లో కూడా విపత్తు వచ్చినప్పుడు.. విదేశాలకు వెళ్లి ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సేవలు అందించాయని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. జపాన్, నేపాల్, టర్కీకి వెళ్లి ఎన్డీఆర్‌ఎఫ్ సేవలు అందించిందని చంద్రబాబు తెలిపారు. విభజన చట్టం ప్రకారం 2018మే 22న అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ద్వారా విజయవాడ దగ్గర్ లో ఎన్ఐడీఎం సౌత్ క్యాంప్ కోసం శంకుస్థాపన జరిగింది. అది ఇప్పటికి పూర్తైంది. దీనికి రూ.160 కోట్లు ఖర్చైంది. ఈ ఉదయం నోవాటెల్ హోటల్‌లో రాష్ట్ర బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశం అయ్యారు. ఏపీలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు. కూటమి పాలన, తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రజా స్పందన గురించి అమిత్ షా ఆరా తీసినట్లు తెలిసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)