మనుషులు రోజూ 8 నుంచి 9 గంటలు నిరంతరాయంగా పనిచేసిన తర్వాత మెరుగైన ఉత్పాదకత సాధించలేరని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదార్ పూనావాలా అన్నారు. అదే కొన్ని తప్పని పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు ఎక్కువ సమయం పని చేస్తారని పేర్కొన్నారు. కానీ ప్రతిరోజు అంటే కష్టమని పేర్కొన్నారు. ''అవసరమైనప్పుడు నేను, నా స్టాఫ్ కొన్ని సార్లు రోజుకు 8 గంటలు పని చేస్తాము. కొవిడ్ సమయంలో నేను రాత్రి 11 గంటలకు ఇంటికి వెళ్లేవాడిని. పనిలో ఎంత సమయం వెచ్చించాలనేది మనం ఉన్న పరిస్థితిని బట్టి ఉంటుంది. మీరు ఇప్పుడే ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెడితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది'' అని పూనావాలా పేర్కొన్నారు. కష్టపడి పని చేయడానికి వేరే ప్రత్నామ్నాయం లేదని, కానీ ఎంత వ్యూహాత్మకంగా, నాణ్యంగా చేస్తున్నామనేది చాలా ముఖ్యమని అన్నారు. తాజాగా ఈ విషయంపై తాజాగా నారాయణ మూర్తి స్పందిస్తూ వారానికి 70గంటల పనిని ఎవరూ ఎవరిపైనా బలవంతంగా రుద్దలేరని తెలిపారు. మీరు ఇలాగే చేయాలి, ఇలా చేయకూడదని ఎవరూ ఎవరికీ చెప్పలేరని అన్నారు. ''నేను చెప్పిన ప్రకారంగానే ప్రజలంతా చేయాలని అనట్లేదు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు చేసుకోవచ్చు. ఈ విషయంలో ఎవరైనా తమ పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. నేను ప్రతి రోజూ ఉదయం 6.20గంటలకు ఆఫీస్‌కు వెళ్లి సాయంత్రం 8.30కి బయటకు వచ్చేవాడిని. అలా 40 ఏళ్లపాటు చేశాను. అప్పుడు కూడా అది తప్పని ఎవరూ నాకు చెప్పలేదు. ఈ అంశంపై వాదోపవాదాలు, చర్చలు అనవసరం'' అని అన్నారు. కొద్దిరోజుల క్రితం ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌ఓ మోహన్‌దాస్ పాయ్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన 'ది రికార్డ్' అనే పాడ్‌కాస్ట్ తొలి ఎపిసోడ్‌లో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి మాట్లాడుతూ ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే భారత్‌లోని యువత వారానికి 70 గంటల పాటు పనిచేయాలని అన్నారు. దీనిపై మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. కొందరు ఉద్యోగ జీవితంలో ఉండే ఇబ్బందులను లేవనెత్తగా, మరికొందరు బాస్‌లు మాత్రం నారాయణ మూర్తి అభిప్రాయాన్ని స్వాగతించారు.
రోజూ 8 నుంచి 9 గంటలు పనిచేసిన తర్వాత మెరుగైన ఉత్పాదకత సాధించలేరు : అదార్ పూనావాలా
January 21, 2025
0
Tags