పోచారంలో రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప చెల్లుమనిపించిన ఎంపీ ఈటల రాజేందర్ !

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మేడ్చల్ జిల్లా పోచారంలో పర్యటించారు. పేదల భూములను ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఆక్రమించాడని ఆయనకు ఫిర్యాదులు అందాయి. తమకు న్యాయం చేయాలని బాధిత పేద ప్రజలు ఈటలను వేడుకున్నట్లు సమాచారం. దీంతో ఘటనా స్థలికి వెళ్లిన ఆయన బ్రోకర్‌తో మాట్లాడుతూ ఒక్కసారిగా కోపోద్రిక్తుడై రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప చెల్లుమనిపించారు. దీంతో ఎంపీ అనుచరులు, బీజేపీనేతలు సైతం ఆ బ్రోకర్ మీద దాడికి పాల్పడ్డారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇవాళ పలానా ప్రాంతానికి వెళుతున్నానని స్థానిక మంత్రి, పోలీసులకు చెప్పి వచ్చాను. నేను ఇక్కడకు వచ్చాక కూడా పేదలను గుండాలు బెదిరించే ప్రయత్నం చేశారు. ఎంపీకి చెప్తారా మీ సంగతి చెప్తాం అని బెదిరించారు. అసలు పోలీసులు ఎవరికి మద్దతు తెలుపుతున్నారు. రోజు రోజుకూ పోలీసులు గౌరవం పోగొట్టుకుంటున్నారు. ప్రజలకు పోలీసులు రక్షణ కల్పించకపోతే.. ఆ బాధ్యత కూడా మేమే తీసుకొని గుండాలను తరిమి వేస్తాం అని ఈటల అన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)