పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం తీరును తప్పుపట్టిన మృతురాలి తండ్రి !

Telugu Lo Computer
0


ఆర్జీకర్‌ ఘటనలో దోషి సంజయ్‌రాయ్‌కు మరణశిక్ష విధించాలంటూ పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం మంగళవారం కలకత్తా హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సర్కారు తీరును మృతురాలి తండ్రి తప్పుపట్టారు. ఈ వ్యవహారంలో సీఎం మమతా బెనర్జీ తొందరపాటు చర్యలు అవసరం లేదని అన్నారు. ''రేపు మాకు తీర్పు కాపీ వస్తుంది. దానిని పరిశీలించిన తర్వాత ఏమి చేయాలో నిర్ణయించుకుంటాం. అప్పటివరకు సీఎం మమతా బెనర్జీ తొందరపాటు చర్యలు తీసుకోకూడదు. ఆమె ఎన్నో మాటలు చెప్పి, సాక్ష్యాలను తారుమారు చేశారు. వాటిని తారుమారు చేసిన వారిలో పోలీస్‌ కమిషనర్, ఇతరుల ప్రమేయం ఉంది. ఇవన్నీ మమత చూడలేదా?'' అని సూటిగా ప్రశ్నించారు. సీబీఐ సరైన సాక్ష్యాధారాలు సమర్పించలేకపోవడం వల్లే స్థానిక కోర్టులో జీవిత ఖైదు పడినట్లు భావిస్తున్నామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలకు కారణమైన కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం కేసులో దోషిగా తేలిన సంజయ్‌ రాయ్‌కు న్యాయస్థానం సోమవారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మరణించే వరకూ జైలు జీవితం గడపాలని పేర్కొనింది. దోషికి రూ.50 వేల జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)