త్వరలో ఆండ్రాయిడ్‌ 11 లోపు వెర్షన్‌ మొబైల్స్‌లో యోనో సేవలు బంద్ !

Telugu Lo Computer
0


స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా త్వరలో ఆండ్రాయిడ్‌ 11, అంత కంటే తక్కువ వెర్షన్‌ మొబైల్స్‌లో యోనో సేవల్ని నిలిపి వేయనుంది. ఆండ్రాయిడ్‌ 11, అంత కంటే పాత వెర్షన్‌ వాడుతున్న స్టేట్‌ బ్యాంక్‌ కస్టమర్లకు సందేశాలు పంపుతోంది. యూజర్ల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి 28 లోపు పాత వెర్షన్‌ ఫోన్లు వాడుతుంటే వారు ఆండ్రాయిడ్ 12 అంత కంటే కొత్త వెర్షన్‌కు అప్‌గ్రేడ్‌ అవ్వాల్సి ఉంటుంది. లేకపోతే యోనో సేవలు నిలిచిపోతాయని స్పష్టం చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)