సుజుకీ నుంచి ఇ-యాక్సెస్‌ స్కూటర్‌ !

Telugu Lo Computer
0


దేశీయ మార్కెట్లోకి సుజుకీ మోటార్‌ సైకిల్‌ ఇండియా తన పాపులర్‌ స్కూటర్‌ యాక్సెస్‌లో ఈవీ వేరియంట్‌ను తీసుకొస్తోంది. దీని ద్వారా విద్యుత్‌ స్కూటర్‌ విభాగంలోకి సుజుకీ సైతం అడుగు పెట్టినట్లయ్యింది. భారత్‌ మొబిలిటీ ఎక్స్‌పో 2025లో ఈ మేరకు సుజుకీ ఇ-యాక్సెస్‌ స్కూటర్‌ను కంపెనీ ప్రదర్శించింది. ఇదే వేదికపై మరో రెండు వాహనాలనూ ఆవిష్కరించింది. సుజుకీ కొత్త విద్యుత్‌ స్కూటర్‌ ఇ- యాక్సెస్‌ 3.07 kWh ఎల్‌ఐపీ బ్యాటరీతో తీసుకొస్తున్నారు. ఇది 95 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుంది. టాప్‌స్పీడ్ గంటకు 71 కిలోమీటర్లు. పోర్టబుల్‌ ఛార్జర్‌తో 6 గంటలు 42 నిమిషాల్లో ఫుల్‌ ఛార్జ్‌ అవుతుంది. ఫాస్ట్ ఛార్జర్‌తో అయితే 2 గంటల 12 నిమిషాల్లో ఛార్జ్‌ పూర్తవుతుందని కంపెనీ వెల్లడించింది. రెండు రైడింగ్‌ మోడ్‌లు, మూడు రంగుల్లో ఈ స్కూటర్‌ లభిస్తుంది. దీని ధర రూ.1.20లక్షల -రూ.1.40 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా. ఇప్పటికే ఓలా, ఏథర్‌, టీవీఎస్, బజాజ్‌, హీరో సంస్థలు విద్యుత్‌ స్కూటర్లను విక్రయిస్తున్నాయి. ఇటీవల హోండా సైతం ఈవీ స్కూటర్‌ను ఆవిష్కరించింది. ఇ- యాక్సెస్‌ ఎంట్రీతో విద్యుత్ ద్విచక్ర వాహన విభాగంలో గట్టి పోటీ నెలకొననుంది. ఇ- యాక్సెస్‌తో పాటు సుజుకీ తన జిక్సర్‌ ఎస్‌ఎఫ్‌ 250  స్పోర్ట్స్ బైక్‌ను ప్రదర్శించింది. 250 సీసీ BS VI ఇంజిన్‌ కలిగిన ఈ మోటార్‌సైకిల్‌ ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌తో నడుస్తుంది. ఇక కొత్త యాక్సెస్ 125 స్కూటర్‌నూ ఆవిష్కరించింది. ఇందులో 125cc సింగిల్ సిలిండర్‌, ఫోర్‌- స్ట్రోక్ ఇంజిన్‌తో తీసుకొస్తున్నట్లు కంపెనీ తెలిపింది. బ్లూటూత్‌ కనెక్టివిటీ, మల్టీ ఫంక్షనల్‌ డిజిటల్‌ ఇన్ట్రుమెంట్‌ క్లస్టర్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. డిజైన్ పరంగా చిన్న చిన్న మార్పులు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)