ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా గంగాసాగరం వద్ద తిరుపతి నుంచి తిరుచ్చి వెళ్తున్న రంగనాథన్ ఇన్ ట్రావెల్ బస్సు టిప్పర్‌ను తప్పించబోయి బోల్తా కొట్టింది. దీంతో ఆ బస్సులో ప్రయాణం చేస్తున్న నలుగురు చనిపోయారు. మిగతా 22 మంది ప్రయాణీకులకు గాయలయ్యాయి. ఇక క్షతగాత్రులు చిత్తూరు ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. వేగంగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ ని తప్పించుకోబోయి బోల్తా పడింది. తిరుపతి నుంచి తరుచనూర్ ఆ ప్రాంతంలో జాతీయ రహదారి పనులు కొనసాగుతున్నాయి. ఆ పక్కనే టిప్పర్ నిలిపి ఉంది. రాత్రి సమయంలో చీకటిగా ఉండటంతో అతివేగంతో వస్తున్న బస్సు టిప్పర్ దగ్గరకు వచ్చే వరకు గమనించలేకపోయాడు డ్రైవర్. హఠాత్తుగా టిప్పర్‌ను తప్పించబోవడంతో బస్సు బోల్తా పడింది. ఈ సందర్భంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా వాళ్ళు గాయపడ్డారు. ప్రయాణ సమయంలో 30 మంది వరకు బస్సులో ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రుల్లో పలువురు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
టిప్పర్‌ను తప్పించబోయి బస్సు బోల్తాపడి నలుగురి మృతి !
January 17, 2025
0
Tags