పెరిగిన బంగారం, వెండి ధరలు !

Telugu Lo Computer
0


రుసగా ఐదవ రోజు కూడా బంగారం వెండి ధరలు పెరిగాయి. 18 క్యారెట్ల నుండి 24 క్యారెట్ల ధరలు సుమారు రూ.500 నుండి రూ.650 వరకు పెరిగాయి. వెండి ధర రూ.1000 పెరిగి లక్షకు చేరువలో రూ.96వేల వద్ద ఉంది. బంగారం, వెండి ధరలు ఇదే ధోరణి కొనసాగిస్తే రానున్న రోజుల్లో వెండి ధర కేజీకి లక్షకి, పసిడి ధర రూ.90 వేలకి చేరిన ఆశ్చర్యాపోవాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. మరోవైపు పెరిపోతున్న ధరలు సామాన్యులకి చుక్కలు చూపిస్తున్నాయి. ఒక విధంగా సంక్రాంతికి దిగొస్తాయి అనుకున్న ధరలు నిరాశే మిగిల్చాయి. ఇకపోతే రానున్న పెళ్లిళ్ల సీజన్లో అయినా బంగారం, వెండి ధరలు దిగొస్తాయా అని ఎదురుచూస్తున్నారు. అంతేకాదు మరోవైపు మండిపోతున్న ధరలు జ్యువెలరీ షాపులకి కూడా కస్టమర్ల కొనుగోళ్లు లేక డీలా పడుతున్నాయి. అయితే ఈసారైనా పెళ్లిళ్ల సీజన్ లో అమ్మకాలు ఉపందుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)