ఒడిశాలోని నబరంగ్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీ మాట్లాడుతూ జార్ఖండ్‌లో ఈరోజు భారీ స్థాయిలో నోట్ల కట్టలు బయటపడ్డాయి. దోచుకున్న ఈ డబ్బుని మోడీ అక్కడ రికవరీ చేస్తున్నారు. నేను ఈ దోపిడీని ఆపేందుకు ప్రయత్నిస్తుంటే, కొందరు నన్ను దూషిస్తున్నారు. మీరే చెప్పండి, మీ డబ్బుని మోడీ ఇలాగే కాపాడాలా? వద్దా? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అవినీతిపరుల్ని జైలుకి పంపిస్తోందని పేర్కొన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని ప్రస్తావిస్తూ అవినీతిని కాంగ్రెస్ సాధారణీకరించిందని ఆయన విమర్శించారు. నలభై ఏళ్ల క్రితం ఒడిశాకు ఓ ప్రధాని వచ్చారని, ఢిల్లీ నుంచి ఒక్క రూపాయి పంపితే పేదలకు కేవలం 15 పైసలు చేరేదని.. అంటే 100 పైసల్లో 85 పైసలు కాంగ్రెస్ దోచుకుందని ఆరోపించారు. కానీ తాను కేంద్రం నుంచి ఒక్క రూపాయి పంపితే ఒక్క పైసా కూడా తిననని, ఎవరైనా ఒక్క పైసా తింటే వాళ్లు జైల్లో చిప్పకూడు తినాల్సిందేనని మోదీ చెప్పుకొచ్చారు. ఇదిలావుండగా.. మనీలాండరింగ్ కేసులో భాగంగా ఈడీ సోమవారం జార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే.. ఒక హౌస్‌కీపర్ ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఆ సొమ్ము రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఆ మొత్తాన్ని లెక్కించేందుకు బ్యాంకు అధికారుల్ని రప్పించారని, భద్రత నిమిత్తం పారామిలిటరీ బలగాలను సైతం మోహరించారని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఝార్ఖండ్ మంత్రి అలంఘీర్ ఆలం సహాయకుడైన సంజీవ్‌లాల్ ఇంట్లో పనిచేసే వ్యక్తి వద్ద ఈ డబ్బు దొరికింది.
మీ డబ్బుని మోడీ కాపాడాలా? వద్దా?
May 06, 2024
0
Tags