అశ్లీల వీడియోల పెన్ డ్రైవ్ కేసు బయటకు రావడంతో హాసన్ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఏప్రిల్ 28వ తేదీ రాత్రి జర్మనీకి పారిపోయారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూ కార్నర్ నోటీసు జారీ చేశారు. బ్లూ కార్నర్ నోటీసు జారీ కావడంతో దేశం విడిచి వెళ్లిన ప్రజ్వల్ రేవణ్ణ కోసం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఉచ్చు బిగించింది. బ్లూ కార్నర్ నోటీసు ఇంటర్‌పోల్ కోడెడ్ నోటీసులలో ఒక భాగం. ఈ నోటీసు అమల్లోకి వస్తే, ప్రపంచంలోని వివిధ దేశాల అధికారులకు ఎవరి మీద బ్లూ కార్నర్ నోటీసు జారీ చేశారో ఆ వ్యక్త గురించి సమాచారం, వార్నింగ్ లతో పాటు అతని గురించి అప్పీళ్లు పంపిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో నేర కార్యకలాపాలను నియంత్రించేందుకు అత్యంత కీలకమైన నేరాలకు సంబంధించిన సమాచారాన్ని ఇతర దేశాల అధికారులతో పంచుకోవడంలో ఈ బ్లూ కార్నర్ నోటీసు సహాయపడుతుంది. తప్పించుకుని తిరుగుతున్న ఓ వ్యక్తిని గుర్తించడానికి, అతని కార్యకలాపాల గురించి అదనపు సమాచారాన్ని సేకరించడానికి ఈ బ్లూ కార్నార్ నోటీసు సహాయపడుతుంది. బ్లూ కార్నర్ నోటీసులతో పాటు మొత్తం ఏడు రకాల నోటీసులను దర్యాప్తు అధికారి లేదా సంబంధిత ఏజెన్సీ అధికారులు ఆ కేసుల ప్రకారం జారీ చేయవచ్చు. రెడ్ కార్నర్ నోటీసు, ఎల్లో కార్నర్ నోటీసు, బ్లూ కార్నర్ నోటీసు. బ్లాక్ కార్నర్ నోటీసు, గ్రీన్ కార్నర్ నోటీసు, ఆరెంజ్ కార్నర్ నోటీసు, పర్పుల్ కార్నర్ నోటీసు అనే ఏడు రకాల నోటీసులు వేర్వేరు అర్థాలను కలిగి ఉన్నాయి. ఇంటర్‌పోల్ నేషనల్ సెంట్రల్ బ్యూరో అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్ జనరల్ సెక్రటేరియట్ ద్వారా ఇలాంటి నోటీసులు జారీ చేస్తారు. ఈ నోటీసులు అమలు చేయబడితే ఆ వ్యక్తి గురించి సమాచారం, అతనికి హెచ్చరిక సందేశాలు అన్ని సభ్య దేశాలకు చేరతాయి. ఇలాంటి నోటీసులు ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా పోలీసు సహకారం, నేర నియంత్రణను సులభతరం చేస్తుంది.
ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు !
May 06, 2024
0
Tags