ఆంధ్రప్రదేశ్ ఇన్‌చార్జి డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి శంఖబ్రత బాగ్చీ నియమితులయ్యారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి నుంచి డీజీపీ బాధ్యతలను శంఖబ్రత బాగ్చీ స్వీకరించారు. డీజీపీ నియామకంపై ఈసీ తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకు బాగ్చీ ఇన్‌చార్జి డీజీపీగా కొనసాగుతారని ఆదేశాల్లో తెలిపారు. డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేయడంతో ఇన్‌చార్జి డీజీపీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ సీఎస్‌కు కీలక ఆదేశాలు జారీ చేసింది. సోమవారం ఉదయం11 గంటల్లోగా ముగ్గురు డీజీ ర్యాంకు అధికారుల జాబితా పంపాలని ఆదేశించింది. కొత్త బాస్ ఎంపిక జాబితాలో శంఖబ్రత బాగ్చీ, సీహెచ్ తిరుమల రావు, అంజనా సిన్హా, మాదిరెడ్డి ప్రతాప్‌లు ఉన్నారు. వారిలో నుంచి ఒకరిని డీజీపీగా నియమిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ క్రమంలో ఈ నేపథ్యంలో సీనియర్ ఐఏఎస్ అయిన బాగ్చీతాత్కాలిక ఇన్‌చార్జి బాధ్యతలు చేపట్టారు. శంఖబ్రత బాగ్చీ కోల్‌కతా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. మూడు గోల్డ్ మెడల్స్ సాధించారు. ఎండీ జనరల్ చదువుతూనే 1996లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. 50వ బ్యాచ్ ఐపీఎస్ శిక్షణా సమయంలో శంఖబ్రత బాగ్చీ ప్రైమ్ మినిస్టర్ బాటన్, కేంద్రహోంమంత్రి రివాల్వర్‌ను గెలుపొందడమే కాకుండా ఐపీఎస్ శిక్షణా సమయంలో అన్ని విభాగాల్లో అద్భుత ప్రతిభకనబరిచిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నగరంలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి ఎంబీఏ చదివారు. ఇకపోతే పోలీస్ రంగంలో పోలీస్ మెడల్, ఉత్కృష్ట సేవా మెడెల్, 2022లో డీజీపీ కమాండేషన్ డిస్‌ను గెలుపొందారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన శంఖబ్రత బాగ్చీ 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం ఆయనను కేంద్రం ఏపీకి ఎంపిక చేసింది.
ఆంధ్రప్రదేశ్ ఇన్‌చార్జి డీజీపీగా శంఖబ్రత బాగ్చీ !
May 06, 2024
0
Tags