పంజాబ్ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు ముగియగానే.. మరోసారి ఎన్నికల సమరం వచ్చే అవకాశం ఉంది. ఆ రాష్ట్రంలో 12 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వీరు విజయం సాధిస్తే.. ఆయా అసెంబ్లీ స్థానాల్లో ఆరు నెలల్లో ఉప ఎన్నికలు వస్తాయి. రాష్ట్రంలో ఇంతమంది ఎమ్మెల్యేలు లోక్‌సభకు పోటీచేస్తుండటం గతంలో ఎన్నడూ చూడలేదని విశ్లేషకులు అంటున్నారు. పంజాబ్‌లో 13 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో 9 నియోజకవర్గాల్లో మొత్తం 12 మంది ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. వీరిలో ఐదుగురు మంత్రులు ఉండటం గమనార్హం ఆరు లోక్‌సభ స్థానాల్లో ఒక్కో ఎమ్మెల్యే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా.. మరో మూడు స్థానాల్లో ఇద్దరేసి ఎమ్మెల్యేలు పోటీలో ఉన్నారు. పోటీపడుతున్న ఎమ్మెల్యేల్లో అధికార ఆమ్‌ఆద్మీ పార్టీకి చెందినవారే తొమ్మిది మంది ఉన్నారు. మిగతా ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఆప్ నుంచి పోటీపడుతున్న మంత్రుల్లో అమృత్‌సర్ నుంచి కుల్‌దీప్‌సింగ్, ఖాదూర్ సాహిబ్ నుంచి లల్‌జిత్ సింగ్ భుల్లార్, బఠిండా నుంచి గుర్మీత్ సింగ్ ఖుడియాన్, సంగ్రూర్ నుంచి గుర్మీత్ సింగ్ మీట్ హయర్, పటియాల నుంచి బల్బీర్ సింగ్ ఉన్నారు.
పంజాబ్ లో లోక్‌సభ బరిలో 12 మంది ఎమ్మెల్యేలు
May 05, 2024
0
Tags