ఆస్ట్రేలియాలో తెలుగు డాక్టర్ దుర్మరణం !

Telugu Lo Computer
0


స్ట్రేలియాలో స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్ వెళ్లిన డాక్టర్ ఉజ్వల ప్రమాదవశాత్తు కాలు జారి లోయలో పడి మరణించింది. మృతురాలు ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన ఉజ్వలగా గుర్తించారు.  డాక్టర్ ఉజ్వల మరణంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆస్ట్రేలియా గోల్డ్‌కోస్ట్‌లోని బాండ్ విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఉజ్వల.. ప్రస్తుతం రాయల్ బ్రిస్బేన్ ఉమెన్స్ ఆసుపత్రిలో డాక్టర్ గా విధులు నిర్వహిస్తోంది. ఈ రోజు మృతదేహం కృష్ణాజిల్లా స్వగ్రామానికి తరలించనున్నారు. అనంతరం ఉంగుటూరు మండలం ఎలుకపాడులో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)