టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తు ఖరారు ?

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో వైసీపీని ఓడించడమే లక్ష్యంగా టీడీపీ-జనసేన-బీజేపీ పార్టీలు ఒక్కటయ్యాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తులో ఉండగా ఈ పొత్తులో బీజేపీ కూడా చేరింది. అంతేకాదు ఈ రెండు పార్టీలు ఎన్డీయే కూడా చేరిపోయాయి. ఈ మేరకు టీడీపీ సీనియర్ నేత కనకమేడల రవీంద్ర ప్రకటన చేశారు. ''టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. పార్టీ బలాబలాలను బట్టి స్థానాలను నిర్ణయిస్తాం. అధికారం కోసం కాదు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో కలిశాం. ఎన్డీయేలో చేరాం. ఏపీని కాపాడుకోవడానికే ఈ పొత్తులు. సీట్లు దక్కని వారికి ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పిస్తాం. '' అని కనకమేడల అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)