ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2024లో ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ ట్రక్, టాక్సీ డ్రైవర్ల కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల వెంబడి కొత్త సౌకర్యాలతో ఆధునిక భవనాలను అభివృద్ధి చేయనుందని ప్రకటించారు. లక్షలాది ట్రక్కు డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు మన సామాజిక, ఆర్థిక వ్యవస్థలో అంతర్భాగంగా ఉన్నారని, వారు తరుచు చాలా గంటలు పనిచేస్తారని, వారికి విశ్రాంతి తీసుకునే అవకాశం ఉండకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాల బారిన పడుతుంటారని ప్రధాని అన్నారు. అయితే, దూర ప్రయాణాలు చేస్తున్న డ్రైవర్లు సరైన విశ్రాంతి పొందేలా కేంద్రం చొరవ తీసుకుంటుందని తెలియజేశారు. అన్ని జాతీయ రహదారులపై ఆహారం, నీరు, వాష్రూమ్స్, పార్కింగ్, విశ్రాంతి గదులతో మెరుగైన సౌకర్యాలతో ఆధునిక భవనాలు నిర్మిస్తామని ప్రకటించారు. ఈ ప్రణాళిక మొదటిదశలో దేశవ్యాప్తంగా 1000 భవనాలను నిర్మించనున్నట్లు వెల్లడించారు.
ట్రక్, టాక్సీ డ్రైవర్ల విశ్రాంతి కోసం ఆధునిక భవనాలు !
February 03, 2024
0
Tags