భారత్‌-మాల్దీవుల కోర్‌ కమిటీ బలగాల ఉపసంహరణపై భేటీ

Telugu Lo Computer
0


భారత్‌-మాల్దీవుల మధ్య దౌత్యపరమైన విభేదాలు నెలకొన్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. మాల్దీవుల్లో ఉన్న భారత సైనిక బలగాల ఉపసంహరణ అంశంపై శుక్రవారం కోర్‌ కమిటీ సమావేశం జరిగింది. ఢిల్లీ వేదికగా ఇరు దేశాల ఉన్నతస్థాయి అధికారులు ఇందులో పాల్గొన్నారు. చైనాకు అనుకూల వ్యక్తిగా పేరున్న మహ్మద్‌ ముయిజ్జు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇరు దేశాల మధ్య దూరం పెరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మార్చి 15 నాటికి తమ భూభాగం నుంచి భారత దళాలు వైదొలగాలని మాల్దీవుల అధ్యక్షుడు ఇటీవల గడువు విధించారు. గతేడాది డిసెంబరులో భారత ప్రధాని మోదీతో జరిగిన భేటీ సందర్భంగానూ ముయిజ్జు ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ సమస్య పరిష్కారానికి కోర్‌ గ్రూప్‌ ఏర్పాటుచేయాలని ఇరువురూ నిర్ణయించారు. ఈ క్ర్రమంలోనే రెండు వారాల క్రితం ఈ కమిటీ మాలెలో భేటీ అయ్యింది. తాజాగా దిల్లీలో మరోసారి సమావేశం నిర్వహించింది. ఈ అంశంలో పరస్పర ప్రయోజనం చేకూర్చే పరిష్కారాన్ని కనుగొనడంపై ఇరు దేశాలు దృష్టి సారించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.


Post a Comment

0Comments

Post a Comment (0)