ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఒక వీడియో పోస్ట్ చేశారు. అందులో పిల్లలకు పరిశుభ్రతను అలవర్చుకోవటం నేర్పించే తీరుపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. మహీంద్రా పంచుకున్న ఈ వీడియో అందరినీ ఆలోచించేలా చేస్తోంది. ఇంతకీ వీడియోలో ఏముందంటే చిన్నారులకు పరిశుభ్రత అలవాటు చేసేందుకు ఓ టీచర్ వినూత్న ఆలోచన చేసింది. విద్యార్థుల కంటే ముందుగా తరగతి గదికి వెళ్లి, ఆడుకొనే వస్తువులు, బొమ్మల్ని చిందరవందర చేస్తుంది. ఆ తర్వాత పిల్లల్ని క్లాస్లోకి అనుమతి ఇస్తుంది. గదిలోకి వచ్చిన పిల్లలు వెంటనే చెల్లాచెదురుగా ఉన్న వస్తువుల్ని సరిచేసి గదంతా శుభ్రం చేస్తారు. ఈ ఆలోచన రేకెత్తించే వీడియోను మహీంద్రా తన 'ఎక్స్' ఖాతాలో పోస్ట్ చేశారు. 'ఎంత మంచి ఆలోచన. అందరి సహకారంతో గదిని చక్కబెట్టారు. ప్రీ, ఎలిమెంటరీ పాఠశాల్లో ఇటువంటి విధానాన్ని మనం భాగం చేయగలమా?' అంటూ తన అభిప్రాయాన్ని తెలిపారు.
ఎంత మంచి ఆలోచన - అందరి సహకారంతో గదిని చక్కబెట్టారు !
January 07, 2024
0
Tags