నీట్ యూజీ-2024 సిలబస్‌ను సవరించినట్లు నేషనల్ మెడికల్ కమిషన్ ప్రకటించింది. తాజా మార్పులతో పాటు పూర్తి సిలబస్ వివరాల కోసం అభ్యర్థులు ఎన్‌ఎంసీ పోర్టల్ nmc.org లేదా ఎన్‌టీఏ పోర్టల్ nta.ac.in చెక్ చేయవచ్చు. కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లో భారీగా సిలబస్‌ను కుదించారు. బయాలజీలో స్వల్పంగా కొన్ని టాపిక్స్ కుదించి, కొత్తగా మరికొన్నింటిని జత చేశారు. నీట్ యూజీ-2024 సిలబస్‌ను సవరిస్తున్నట్లు ఇంతకుముందే నేషనల్ మెడికల్ కమిషన్ నోటిఫై చేసింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో పనిచేసే అటానమస్ బాడీ 'అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్' నీట్ సిలబస్‌ను ఖరారు చేసింది. దీంతో నీట్ యూజీ-2024కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కొత్తగా అప్‌డేట్ అయిన సిలబస్‌ను కవర్ చేయాల్సి ఉంటుంది. కెమిస్ట్రీ ఫస్టియర్ సిలబస్ నుంచి హైడ్రోజన్, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, ఎన్విరాన్‌మెంటల్ కెమిస్ట్రీ; కెమిస్ట్రీ సెకండియర్ నుంచి మెటలర్జీ, పాలిమర్స్ వంటి టాపిక్స్‌ను తొలగించారు. ఫిజిక్స్ ఫస్టియర్ సిలబస్ నుంచి ప్యూర్ రోలింగ్, కనెక్టింగ్ బాడీస్, పాలిట్రోపిక్ ప్రాసెస్ వంటి టాపిక్స్ తీసేశారు. ఫిజిక్స్ సెకండియర్ సిలబస్ నుంచి ప్రొటెన్షియో మీటర్, ఎర్త్ మ్యాగ్నటిజం, రేడియో యాక్టివిటీ, ట్రాన్సిస్టర్లు, ఆంప్లిప్లయర్లు వంటి ఇతర టాపిక్స్ తొలగించారు. జువాలజీలో యూనిట్ -2 నుంచి వానపాములు, యూనిట్-5లో శరీర నిర్మాణశాస్త్రం, జీర్ణక్రియ శోషణం, జ్ఞానేంద్రియాలు (చెవులు, కండ్లు), యూనిట్ -10లో జీవావరణం, పర్యావరణం, పర్యావరణ సమస్యలు, పశుసంవర్ధకం వంటి టాఫిక్స్ నీట్ సిలబస్ నుంచి తొలగించారు. బోటనీ ఫస్టియర్ సిలబస్‌లో ప్లాంట్ ఫిజియోలజీలో ట్రాన్స్‌పోర్ట్ ఇన్ ప్లాంట్స్, మినరల్ న్యూట్రిషన్; బోటనీ సెకండియర్ నుంచి స్ట్రాటజీస్ ఫర్ ఎన్‌హ్యాన్స్‌మెంట్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్‌ను తీసేశారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ బోటనీ సిలబస్‌కు కొత్తగా కొన్ని టాపిక్స్ చేర్చింది. బయో మాలిక్యూల్స్, ఎంజైమ్స్, మాల్వేస్, లెగుమనీస్ వంటి టాఫిక్స్ ఇందులో ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్స్ చెక్ చేయవచ్చు.
నీట్ సిలబస్‌లో భారీ మార్పులు !
November 23, 2023
0
Tags