అమెరికా, కెనడాలను బెంబేలెత్తిస్తున్న అడవి పందులు

Telugu Lo Computer
0


మెరికా, కెనడాలను అడవి పందులు బెంబేలెత్తిస్తున్నాయి. విపరీతంగా పెరుగుతున్న వాటి సంఖ్య రైతులకు, ప్రభుత్వాలకు హడలు పుట్టిస్తోంది. కెనడాలో విపత్తుగా మారిన 'సూపర్ పిగ్స్', ఇప్పుడు సరిహద్దు దాటి నార్త్‌ అమెరికాలోని కొన్ని రాష్ట్రాలకు సైతం వలస వెళ్తున్నాయి. దీంతో మిన్నెసోటా, నార్త్ డకోటా, మోంటానా వంటి రాష్ట్రాలు ఇప్పుడు ఈ అడవి పందుల దాడిని ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ సమస్య కెనడాలో ప్రారంభమైంది. అక్కడి అల్బెర్టా, సస్కట్చేవాన్, మానిటోబాలో, అడవి యురేషియన్ పందులు.. డొమెస్టిక్‌ స్వైన్స్‌తో సంతానోత్పత్తి చేసి క్రాస్‌బ్రీడ్‌లుగా పరిణామం చెందాయి. నిపుణులు వీటిని 'సూపర్ పిగ్స్' అని పిలుస్తారు. సస్కట్చేవాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ర్యాన్ బ్రూక్ మాట్లాడుతూ.. ఫెరల్ స్వైన్‌ను భూమి మీద అత్యంత ఎక్కువగా దాడి చేసే జంతువుగా అభివర్ణించారు. వాటిని 'ఎకలాజికల్‌ ట్రెయిన్‌ వ్రెక్‌'తో పోల్చారు. ఈ పందులు ఉత్తర అమెరికాకు చెందినవి కావు. కెనడాలో 1980లలో అడవి పందులను పెంచడానికి రైతులను ప్రోత్సహించినప్పటి నుంచి సమస్య మొదలైనట్లు గుర్తించారు. 2001లో మార్కెట్ పతనానికి విసుగు చెందిన రైతులు పందులను వదిలేశారు. దీంతో అవి కెనడాలో చలికాలంలో మనుగడ సాధించేందుకు అలవాటు పడ్డాయి. ఈ సూపర్ పిగ్స్‌ తెలివైనవి, అనుకూలమైనవి. వీటికి బొచ్చు ఉంటుంది. పంటలు, వన్యప్రాణులు సహా వాటి మార్గంలో దేనినైనా మింగేస్తాయి. వాటి విధ్వంసక ఆహార అలవాట్లు భూమిని దెబ్బతీస్తాయి. వీటి ద్వారా ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వంటి వ్యాధులు హాగ్ ఫామ్‌లకు వ్యాపించే ప్రమాదం ఉంది. వాటి వేగవంతమైన పునరుత్పత్తి సామర్థ్యం సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. మొత్తానికి వాటిని నియంత్రించడం ఒక సవాలుగా మారింది. అడవి పందులు ఇప్పటికే అమెరికాలోని పంటలకు దాదాపు $2.5 బిలియన్ల నష్టం కలిగిస్తున్నాయి. టెక్సాస్ వంటి దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్రత ఎక్కువగా ఉంది. ఆర్థిక ఆందోళనలకు మించి, ఈ పందులు మానవులకు ఎక్కువ నష్టం చేకూరుస్తున్నాయి. అప్పుడప్పుడు వీటి దాడుల్లో మనుషులు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాటిని నిర్మూలించే ప్రయత్నాలు సవాళ్లతో కూడుకున్నవి. సంప్రదాయ వేట పద్ధతులు పందులను మరింత అంతుచిక్కని విధంగా, రాత్రిపూట సంచరించేలా బలోపేతం చేస్తున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)