ఎన్‌కౌంటర్ లో ఇద్దరు అధికారులతో సహా ముగ్గురు జవాన్ల వీరమరణం !

Telugu Lo Computer
0


జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరీలో బుధవారం ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. గత 24 గంటలుగా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఆర్మీ అధికారులతో పాటు ముగ్గురు సైనికులు మొత్తంగా ఐదుగురు వీరమరణం పొందారు. గురువారం కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మరణించిన వారి ఫోటోలు పేర్లను ఎక్స్(ట్విట్టర్) ద్వారా వెల్లడించారు. ''కెప్టెన్ ఎంవీ ప్రాంజల్, కెప్టెన్ శుభమ్ గుప్తా, హవార్దార్ అబ్దుల్ మజీద్‌లు ఉగ్రవాదుల నుంచి మనల్ని రక్షించేందుకు తమ ప్రాణాలను త్యాగం చేశారు.'' అని చేతులు జోడించే ఏమోజీని పోస్ట్ చేశారు. కెప్టెన్ ప్రాంజల్(29), 63 రాష్ట్రీయ రైఫిల్స్‌లో విధులు నిర్వహిస్తున్నారు. మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (MRPL) రిటైర్డ్ డైరెక్టర్ కుమారుడు, మైసూరుకు చెందిన కెప్టెన్ ప్రాంజల్, దక్షిణ కన్నడ జిల్లాలోని సూరత్‌కల్‌లో పాఠశాల విద్యను అభ్యసించాడు మరియు నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుండి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. బెంగళూర్ శివార్లలోని అనేకల్ ప్రాంతంలో నివసిస్తున్నారు. అతని మృతదేహాన్ని సాయంత్రం బెంగళూర్‌కి తీసుకురానున్నారు. బెన్నెరఘట్టలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)