ఎగరడం ఆలస్యం కాదు - ఆమె ఈరోజు నా హీరో

Telugu Lo Computer
0


నంద్ మహీంద్రా 97 సంవత్సరాల పెద్దావిడ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఇంతకీ ఆవిడ ఏం చేసింది? అంటే.. ఆ వయసులో ఎవరూ చేయలేని సాహసం చేసిందని చెప్పాలి. ఓ శిక్షకుడి సాయంతో పారా-మోటరింగ్ చేస్తున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది. ఎంతో ఉత్సాహంగా పారా-మోటరింగ్ చేస్తూ గాల్లో ఎగురుతూ కనిపించింది. ఆమె ధైర్యానికి సెల్యూట్ చేయాల్సిందే. ఆమె ఉత్సాహాన్ని స్ఫూర్తిగా తీసుకోవాల్సిందే. 'ఎగరడం ఆలస్యం కాదు.. ఆమె ఈరోజు నా హీరో' అనే క్యాప్షన్‌తో ఆనంద్ మహీంద్రా ఆ పెద్దావిడ పోస్టును తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసారు. ఈ క్లిప్ నిజానికి ఇన్‌స్టాగ్రామ్ పేజీ 'ఫ్లయింగ్ రైనో పారా-మోటరింగ్' లో పోస్టు చేయబడింది. 'ఆర్మీ పారా-కమాండో పైలట్లు, అనుభవజ్ఞులైన వైమానిక దళ సిబ్బంది' దీనిని నడుపుతున్నట్లు పేజీ బయోలో వివరించారు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది నెటిజన్లు 'ఆమె ధైర్యం, జీవిత అభిరుచి మనం కూడా ప్రేరణగా తీసుకోవాలి' .. 'వయస్సు అనేది కేవలం ఒక నంబర్, ఒక వృద్ధురాలు నిర్భయంగా పారాగ్లైడింగ్‌ని చేస్తున్న ఈ వీడియో దానిని రుజువు చేసింది' అని కామెంట్లు పెట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)