వరల్డ్‌కప్ టోర్నమెంట్‌ను క్రికెట్ అభిమానులు రికార్డుస్థాయిలో వీక్షించినట్లు తెలిసింది. ఏకంగా 51.8 కోట్ల మంది భారతీయులు టోర్నమెంట్ ను తిలకించినట్లు డిస్నీ సంస్థ తెలిపింది. ఐసీసీ ఆధ్యర్యంలో 48 రోజుల పాటు జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ టోర్నమెంట్‌ను 51.8 కోట్ల మంది భారతీయులు వీక్షించారని డిస్నీ చెప్పింది. హాట్‌స్టార్ స్ట్రీమింగ్ యాప్ ద్వారా 5.9 కోట్ల మంది ఫైనల్ మ్యాచ్‌ను చూసి రికార్డు నెలకొల్పినట్లు కంపెనీ వివరించింది. 2024 నుంచి 2027 వరకు భారతదేశంలో జరిగే అన్ని ఐసీసీ టోర్నమెంట్‌లను ప్రసారం చేయడానికి దాదాపు రూ.25 వేల కోట్లు చెల్లించి డిజిటల్, స్ట్రీమింగ్ హక్కులను కంపెనీ కొనుగోలు చేసినట్లు తెలిపింది. పన్నెండేళ్ల తర్వాత భారత్‌లో ఆడిన ఐసీసీ ఫైనల్ టోర్నమెంట్‌ను 51.8 కోట్ల మంది చూసినట్లు బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రిసెర్చ్ కౌన్సిల్ ఇండియా(బీఏఆర్‌సీ) నిర్ధారించింది. దాదాపు 42,200 కోట్ల నిమిషాల టీవీ స్క్రీన్ టైం నమోదైందని బీఏఆర్‌సీ తెలిపింది. కేవలం భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌ను 13 కోట్ల మంది, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్‌ను 8 కోట్ల మంది, ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌ను 7.5 కోట్ల మంది వీక్షించారని వివరించింది.
ప్రపంచకప్ క్రికెట్‌ను 51.8 కోట్ల మంది భారతీయులు తిలకించారు !
November 23, 2023
0
Tags