ఢిల్లీలో బాణాసంచాపై నిషేధం !

Telugu Lo Computer
0


ఢిల్లీ ప్రభుత్వం బాణాసంచా తయారీ,అమ్మకాలు, నిల్వ, వినియోగంపై ఈ ఏడాది కూడా నిషేధం విధించింది. చలికాలం నేపథ్యంలో కాలుష్యాన్ని అరికట్టేందుకు దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా అమ్మకాలు, కాల్చడంపై ఆంక్షలు విధించింది. బాణాసంచా అమ్మకాలు, తయారీపై నిషేధం విధించడం వరుసగా ఇది మూడోసారి. బాణాసంచ తయారీ, అక్రమ నిల్వలపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. చలికాలం కాలుష్యాన్ని అరికట్టే కార్యాచరణలో భాగంగా బాణాసంచా తయారీ, అమ్మకం, నిల్వ, వాడకాన్ని నిషేధించినట్లు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. పటాకులను నిషేధించాలని పొరుగు రాష్ట్రాలకు కూడా విజ్ఞప్తి చేసినట్లు చెప్పింది. పటాకులకు సంబంధించి ఎవరికీ లైసెన్సులు ఇవ్వకూడదని అధికారులకు సూచించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)