రాజస్థాన్ పెట్రోలియం డీలర్లు పన్నులు తగ్గించాలనే డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా సమ్మెను ప్రకటించారు. నిరసనలో భాగంగా సెప్టెంబర్ 13, 14 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకులు బంద్ చేయనున్నారు. ఆ తర్వాత కూడా ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చకపోతే,, సెప్టెంబర్ 15 నుంచి పెట్రోల్ పంప్ ఆపరేటర్లు నిరవధిక సమ్మెకు దిగనున్నట్టు పిలుపునిచ్చారు. రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో ఇంధనం ధర అత్యంత ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.112.74కి చేరగా, డీజిల్ ధర లీటరుకు రూ.97.57గా ఉంది. ఇదిలావుండగా, పోర్ట్ బ్లెయిర్ లో మాత్రం ఇవి చాలా చౌకగా లభిస్తున్నాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.84.10, డీజిల్ లీటరుకు రూ.79.74గా ఉంది.
రాజస్థాన్ లో 13వ తేదీ నుంచి పెట్రోల్ బంకులు బంద్
September 11, 2023
0
Tags