రద్దీగా ఉండే మార్కెట్లో భార్యను గొడ్డలితో నరికి చంపాడు !

Telugu Lo Computer
0


పంజాబ్‌ కు చెందిన ఓ దంపతుల మధ్య కొన్నాళ్ల నుంచి వివాదం నడుస్తోంది. భార్యభర్తల మధ్య విబేధాల కారణంగా విడాకుల కేసులో కోర్టులో ఉంది. ఈ క్రమంలోనే ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. సంగ్రూర్ లోని అత్యంత రద్దీగా ఉండే సున్నం మార్కెట్ లో తన భార్య కనిపించేసరికి ఆగ్రహంతో ఊగిపోయిన భర్త, ఆమెపై గొడ్డలితో దాడి చేశాడు. ఆమె గట్టిగా కేకలు వేస్తూ చంపొద్దని వేడుకున్నా, మరింత కోపంతో గొడ్డలితో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే రక్తపు మడుగులో ప్రాణం విడిచింది. ఆ సమయంలో మార్కెట్ లో జనం పెద్ద సంఖ్యలో ఉన్నారు. కొందరు అడ్డుకునేందుకు ముందుకు వస్తుంటే వారికి గొడ్డలి చూపిస్తూ నిందితుడు భయపెట్టాడు. కొందరు నిందితుడిపై ఇటుకలతో దాడి చేశారు. మరికొందరు కర్రలు చేతిలో పట్టుకుని కనిపించారు. ఓ వ్యక్తి అయితే.. నీళ్లతో నిండి ఉన్న బకెట్ ను నిందితుడిపై విసిరేశాడు. దీంతో వారిపై కోపంతో రగిలిపోతూ గట్టిగా అరిచాడు. అక్కడ ఉన్న వారంతా తనను ఎలాగైనా చంపేస్తారనుకున్నాడో ఏమోగానీ.. వెంట తెచ్చుకున్న విషాన్ని తాగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే స్థానికులు అడ్డుకుని.. దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఎలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పారు. నిందితుడిని డిశ్చార్జ్ చేయగానే పోలీసులు అరెస్ట్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)