ఉత్తరప్రదేశ్ లో రాష్ట్ర రోడ్ ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ లో కాంట్రాక్ట్ విధానంలో కండక్టర్ గా మోహిత్ యాదవ్ పనిచేసేవాడు. గత నెల జూన్‌లో ఓ రోజు మోహిత్ బరేలీ నుంచి డీల్లీ వెళుతున్న బస్సులో డ్యూటీలో ఉన్నాడు. ఆ బస్సులో ఇద్దరు ముస్లింలు ప్రయాణిస్తున్నారు. వారికి నమాజ్ సమయం కావటంతో కండక్టర్ బస్సు ఆపమని కోరారు. దానికి మోహిత్ కూడా సరేనంటూ వారు నమాజ్ చేసుకోవటానికి వీలుగా కొద్దిసేపు బస్సు ఆపాడు. ఈ విషయం కొన్ని రోజులకు సదరు ట్రాన్స్ పోర్టు యాజమాన్యానికి తెలిసింది. దీంతో యూపీ ఆర్‌టీసీ అతడిని అతడి కాంట్రాక్ట్ రద్దు చేసి ఉద్యోగం నుంచి తీసివేసింది. కనీసం వివరణ కూడా కోరకుండా ఇలా అర్థాంతరంగా ఉద్యోగం నుంచి తొలగించటంతో దిక్కుతోచలేదు మోహిత్ కు. అదే విషయంపై యాజమాన్యాన్ని ప్రశ్నించినా ఎటువంటి సమాధానం లేదు. దీంతో వేరే దారి లేక కుటుంబం కోసం మరో ఉద్యోగం వెతుకునే పనిలో పడ్డాడు. కానీ చాలా చోట్ల యత్నించినా ఉద్యోగం దొరకలేదు. అప్పటికే కుటుంబ భారం పెరిగిపోయింది. చాలా అప్పులు చేశాడు. ఓ పక్క ఉద్యోగం లేక అప్పులు తీర్చే శక్తి లేక ఆర్థికకష్టాల్లో కూరుకుపోయిన మోహిత్ యాదవ్ సోమవారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
మనస్తాపంతో కండక్టర్ ఆత్మహత్య
August 31, 2023
0
Tags