చంద్రయాన్-3 కక్ష్యను తగ్గించే చివరి ప్రక్రియను విజయంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో ప్రకటించింది. రేపు ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్‌ను విడగొట్టేందుకు ప్రణాళిక రూపొందించినట్లు ఇస్రో ఛైర్మన్ సోమ్‌నాథ్ తెలిపారు. వ్యోమనౌక చివరి ఘట్టానికి చేరువైంది. బుధవారం ఉదయం 8.30 గంటలకు చివరిది, ఐదో కక్ష్య తగ్గింపు ప్రక్రియ విజయవంతమైంది. ఈ మేరకు ఇస్రో ఓ ప్రకటన విడుదల చేసింది. అంతరిక్ష నౌక 153 కిలోమీటర్లు X 163 కిలోమీటర్ల కక్ష్యలోకి చేరినట్లు తెలిపింది. గురువారం ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండింగ్ మాడ్యూల్ విడగొట్టే ప్రక్రియ చేటట్టేందుకు ప్రణాళిక రూపొందించినట్లు ఇస్రో వెల్లడించింది. ప్రక్రియ చేపట్టాలని భావిస్తున్న ఇస్రో.. అందుకోసం డీబూస్ట్ అనే పద్ధతిని అనుసరించనుంది. అడ్డంగా ప్రయాణం చేస్తున్న చంద్రయాన్-3 చివరి 30 కిలోమీటర్లకు చేరుకునే సరికి నిట్టనిలువునా ల్యాండ్ కానుంది. ఈ అంతరిక్ష నౌక వేగాన్ని చివరి 30 కిలోమీటర్ల ఎత్తు నుంచి తుది ల్యాండింగ్‌కు చేర్చే ప్రక్రియ అత్యంత కీలకమని ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమ్‌నాథ్ తెలిపారు. ల్యాండింగ్ ప్రక్రియ మొదలైనప్పుడు అంతరిక్ష నౌక వేగం సెకనుకు 1.68 కిలోమీటర్లుగా ఉంటుందని ఆయన చెప్పారు. ఈ ప్రక్రియ సమయంలోనే చంద్రయాన్-2 లో సమస్య ఏర్పడినట్లు సోమ్‌నాథ్ వెల్లడించారు. చంద్రయాన్ - 3 ప్రయోగం చేపట్టగా అంతరిక్ష నౌక ఈనెల 5న చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించింది. చంద్రమామకు చేరువయ్యేందుకు ఈనెల 6, 9, 14 తేదీల్లో మూడుసార్లు కక్ష్య తగ్గింపు ప్రక్రియలు విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో ప్రకటించింది. చంద్రయాన్-3 మిషన్ పురోగతి సాధించినకొద్దీ.. చంద్రగ్రహంపై అడుగుపెట్టేందుకు వీలుగా అంతరిక్ష నౌక కక్ష్యను క్రమంగా తగ్గించే ప్రక్రియ చేపట్టింది. అంతా సజావుగా సాగితే ఈ నెల 23 సాయంత్రం ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టనుంది. "చంద్రుడికి దగ్గరగా మరో అడుగు పడింది. ఐదో కక్ష్య తగ్గింపు ప్రక్రియ విజయవంతమైంది. చంద్రయాన్ 3 153 కిలోమీటర్లు X 163 కిలోమీటర్ల కక్ష్యలోకి చేరింది. దీంతో కక్ష్య తగ్గింపు విన్యాసాలు పూర్తయ్యాయి" కేంద్ర మంత్రి డా. జితేంద్ర సింగ్ ట్వీట్ చేశారు.
చివరి కక్ష్య తగ్గింపు విజయవంతం
August 16, 2023
0
Tags