జైలర్ బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తోంది. వరుస ఫ్లాపుల్లో ఉండడంతో రజనీకి కూడా జైలర్ పై నమ్మకం లేదు కానీ సాలిడ్ కంటెంట్ పడితే మౌత్ టాక్‌తోనే సినిమాలు హిట్ అవుతాయని జైలర్ ప్రూవ్ చేసింది. ఫస్ట్ డేనే ఈ సినిమా వంద కోట్ల వరకు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. రెండున్నర రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ టచ్ చేసి మూడు రోజుల్లోనే 200 కోట్లకు పైగా రాబట్టింది. గత గురువారం థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా మంగళవారం వరకు మొత్తంగా ఆరు రోజుల్లో 400 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది. దీంతో ఫాస్టెస్ట్ 400 కోట్ల క్లబ్‌లో చేరిన తమిళ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది జైలర్. రోబో 2.O, పొన్నియన్ సెల్వన్, కబాలి, విక్రమ్ సినిమా తర్వాత ఐదో చిత్రంగా జైలర్ నిలిచింది. అంతేకాదు ఈ వీకెండ్ వరకు 500 కోట్ల మార్క్‌ని టచ్ చేయడం గ్యారేంటీ అని లెక్కలు వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇక తెలుగులో జైలర్ దెబ్బకు భోళా శంకర్ సినిమా మరింత వీక్ అయింది. కోట్ల షేర్ నుంచి లక్షల్లోకి పడిపోయినట్టుగా చెబుతున్నారు. జైలర్ మాత్రం కోట్లకు కోట్లు రాబడుతోంది.
ఫాస్టెస్ట్ 400 కోట్ల క్లబ్‌లో చేరిన జైలర్ !
August 16, 2023
0
Tags