విశ్వకర్మ యోజనను ప్రకటించిన మోడీ !

Telugu Lo Computer
0


స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ దేశంలోని ప్రజలందరినీ ఉద్ధేశించి ఎర్రకోట మీద నుంచి ప్రసంగం చేశారు. ఈ క్రమంలో దేశ ప్రజల కోసం కొత్త పథకాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. వెనుకబడిన కులాలకు అండగా నిలిచేందుకు విశ్వకర్మ యోజనను ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. దీనికింద ప్రజలకు రూ.13,000 - 15,000 కోట్లను కేటాయిస్తున్నట్లు తెలిపారు. మంగలి, చర్మకారులు, కమ్మరి వంటి ఓబీసీ కమ్యూనిటీకి చెందిన కార్మికులకు సహాయం చేయడానికి ఈ స్కీమ్ ఉద్ధేశించబడింది. సాంప్రదాయ నైపుణ్యాలు కలిగిన వ్యక్తుల్లో ఆర్థిక వృద్ధి, సామాజిక పురోగతిని పెంచే లక్ష్యంతో వచ్చే నెల విశ్వకర్మ జయంతి సందర్భంగా పథకాన్ని ప్రారంభించనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోడీ వచ్చే ఐదేళ్లలో భారత్‌ ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తుందని అన్నారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ 10వ స్థానంలో ఉన్నట్లు ప్రధాని తెలిపారు. అయితే 140 కోట్ల భారతీయుల కృషితో దేశం వేగంగా వృద్ధి చెందుతూ ప్రస్తుతం 5వ స్థానానికి చేరుకుందని ఎర్రకోట ప్రసంగంలో తెలిపారు. దేశ ప్రజల కృషితోనే ఇదంతా సాధ్యమైందని ఆయన అన్నారు. అవినీతికి తావులేకుండా లీకేజీలను ఆపామని తద్వారా బలమైన ఆర్థిక వ్యవస్థను సృష్టించగలిగామని ప్రధాని తన ప్రసంగంలో చెప్పారు. 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ భారత ప్రజలను "నా తోటి పౌరులు" అని సంబోధించకుండా ప్రధాని మోడీ బుధవారం దేశాన్ని తన "కుటుంబ సభ్యులు" అని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)