బ్రిటీష్ గడ్డపై భారత 77వ స్వాతంత్ర్య సంబరాలు మారుమోగాయి. 100మంది సంగీత కళాకారులు భారత జాతీయ గీతం 'జనగణమన'ను ఆలపించారు. బ్రిటన్ గడ్డపై 'జనగణమన వినిపిస్తే ఆ ఉద్వేగం గురించి మాటల్లో చెప్పలేం. దే చేసి చూపించారు భారతీయ స్వరకర్త, మూడు సార్లు 'గ్రామీ అవార్డు' విజేత రికీ కేజ్. 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ 'జనగణమన' వీడియోను ట్విటర్ వేదికగా విడుదల చేశారు. ఈ సందర్భంగా రికీ కేజ్ భావేద్వేగం చెందుతు ''లండన్‌లోని పేరుపొందిన 'అబే రోడ్ స్టూడియోస్'లో 'ది రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా'కు చెందిన 100 మంది కళాకారుల బృందంతో జనగణమన గీతాన్ని రికార్డు చేశాను. భారత జాతీయ గీతాన్ని రికార్డ్ చేసిన అతిపెద్ద ఆర్కెస్ట్రా ఇదే. చాలా అద్భుతంగా వచ్చింది. గీతం చివర్లో నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. భారతీయ స్వరకర్తగా గొప్ప అనుభూతిని పొందా'' అని పేర్కొన్నారు.
బ్రిటీష్ గడ్డపై భారత 77వ స్వాతంత్య్ర సంబరాలు !
August 15, 2023
0
Tags