77వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో భారత దేశ ప్రధాని మోదీ ఎర్రకోటపై జెండా ఎగురవేశారు. అనంతరం ఎర్రకోటపై ప్రసంగించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కొత్త పథకాలను ప్రకటించారు. మధ్య తరగతి కుటుంబాలకు సొంతింటి కల నెరవేర్చే విధంగా ఓ ప్రకటన వెలువరించారు. ఇంటి రుణంలో రాయితీని కల్పించనున్నట్లు తెలిపారు. వచ్చే నెల నుండి సంప్రదాయ చేతి వృత్తుల సహకారం కోసం విశ్వకర్మ యోజన అమలు చేస్తున్నట్లు ప్రధాని వివరించారు. 2 కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా 'లాఖ్‌పతి దీదీ' పథకం తేనున్నట్లు ప్రకటించారు. సంక్షేమానికి అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. నిత్యావసరాల సరుకుల ధరలు పెరుగుదలను స్థిరీకరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. కేంద్రం కల్పిస్తున్న పథకాలను పక్కాగా అమలు చేయనున్నట్లు తెలిపారు. డ్వాక్రా మహిళలను లక్షాధికారులను చేసేందుకు 'లాఖ్‌పతి-దీదీ' పథకం అమలు చేయనున్నట్లు ప్రధాని తెలిపారు. గ్రామాల్లో ఉన్న 2 కోట్ల మంది మహిళామణులను లక్షాధికారులను చేయడమే ఆయన కల అని.. భారత వ్యవసాయం రంగంలో సాంకేతిక పరిజ్ఞానం పెరగాలని ప్రధాని అన్నారు. అగ్రిటెక్ బలోపేతమవ్వడానికి స్వయం సహాయక బృందాల్లో ఉన్న మహిళలకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. వేలాది మంది మహిళా బృందాలకు భారత ప్రభుత్వం డ్రోన్లను సమకూరుస్తుంది. వ్యవసాయ రంగంలో డ్రోన్లను అందుబాటులో ఉండేలా చేయాలని ప్రధాని కోరారు. దీని కోసం 15 వేల డ్వాక్రా బృందాలతో ఈ పథకాన్ని ప్రారంభిస్తామన్నారు.ఎర్రకోట సాక్షిగా ప్రధాని మోదీ రెండు కీలక ప్రకటనలు చేశాడు. మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కల నేరవేర్చేందుకు బ్యాంకు లోన్స్ రాయితీలు కల్పిస్తున్నట్లు, సంప్రదాయ చేత వృత్తుల వారి కొరకు విశ్వకర్మ యోజనను వచ్చే నెల నుండి అమలు పరిచే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
సొంతింటి కోసం మరో పథకం !
August 15, 2023
0
Tags