ఉత్తర ప్రదేశ్ లోని జ్ఞానవాపి మసీదు వివాదం ఇవాళ మరో మలుపు తిరిగింది. ఈ మసీదులో శాస్త్రీయ సర్వే జరిపించాలంటూ పలు హిందూ సంస్ధల నుంచి వచ్చిన అభ్యర్ధనలను మన్నించిన వారణాసి కోర్టు అందుకు అంగీకరించింది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో సర్వే చేయించేందుకు అంగీకరించింది. అయితే ఇందులో గతంలో శివలింగం దొరికిందని చెబుతున్న ప్రాంతాన్ని మాత్రం సర్వే నుంచి మినహాయించింది. వజుఖానా ప్రాంతం కాకుండా జ్ఞాన్‌వాపి మసీదు ప్రాంగణాన్ని శాస్త్రీయంగా సర్వే చేసేందుకు వారణాసి కోర్టు అనుమతించింది. జ్ఞాన్‌వాపి మసీదులో గుర్తించిన శివలింగం వయస్సును నిర్ధారించడానికి కార్బన్ డేటింగ్‌తో సహా శాస్త్రీయ సర్వేను కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు విచారిస్తోంది. హిందూ దేవాలయం ఉన్న స్థలంలో మసీదు నిర్మించబడిందో లేదో తెలుసుకోవడానికి శాస్త్రీయ సర్వేను కోరిన హిందూ భక్తుల బృందం పిటిషన్‌ను కోర్టు సమర్థించింది. అయితే హిందూ న్యాయవాదులు 'శివలింగం'గా పేర్కొంటున్న నిర్మాణం ఉన్న బారికేడ్ 'వజుఖానా' సర్వేలో చేర్చవద్దని వారణాసి కోర్టు ఆదేశించింది. మసీదు అధికారులు ఈ నిర్మాణం వాస్తవానికి 'వజుఖానా'లోని ఫౌంటెన్‌లో ఒక భాగమని, ఇక్కడ నమాజ్‌కు ముందు అభ్యంగన స్నానం చేస్తారని కోర్టుకు తెలిపారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆగస్టు 4 నాటికి సర్వే నిర్వహించి తుది నివేదికను సమర్పించనుంది. తదుపరి విచారణ ఆగస్టు 4న ఉంటుంది. ముస్లింల తరపు న్యాయవాది మహ్మద్ తౌహీద్ ఖాన్ మాట్లాడుతూ..సీల్డ్ వజుఖానా మినహా ఆ ప్రాంతంలో ఏఎస్ఐ సర్వే నిర్వహించాలని (హిందూ సంస్ధలు ) చేసిన దరఖాస్తును ఈరోజు కోర్టు ఆమోదించిందని తెలిపారు. ఆగస్టు 4లోగా నివేదికను సమర్పించాలని కోర్టు ఏఎస్ఐని కోరింది. ఆర్డర్ కాపీని పరిశీలించిన తర్వాత మా తదుపరి చర్యల్ని నిర్ణయిస్తామని కోర్టు చెప్పిందన్నారు.వాస్తవానికి జ్ఞానవాపి మసీదు సముదాయాన్ని మొత్తం సర్వే చేసేలా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ని ఆదేశించాలని కోరుతూ హిందూ సంస్ధలు ఈ కేసులో పిటిషన్ దాఖలు చేశాయి. https://t.me/offerbazaramzon
జ్ఞానవాపి మసీదులో సర్వేకు వారణాసి కోర్టు అనుమతి !
July 21, 2023
0
Tags