మద్యం మత్తులో రైల్వే ట్రాక్‌పై కారు నడిపిన వ్యక్తి అరెస్టు !

Telugu Lo Computer
0


కేరళ లోని కన్నూరులో మద్యం మత్తులో రైల్వే ట్రాక్‌పై కారు నడిపిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ వ్యక్తిని కన్నూరుకు చెందిన జయప్రకాశన్‌(48)గా గుర్తించినట్టు కేరళ పోలీసులు తెలిపారు. జయప్రకాశన్ రోడ్డు కారును నడుపుకుంటూ వెళుతూ సిటీ లోపల ఉన్న రైల్వే ట్రాక్‌పైకి కారు పోనివ్వడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఆ సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నాడని వెల్లడించిన పోలీసులు, రైల్వే ట్రాక్‌ను అడ్డరోడ్డు అని తప్పుగా అనుకొని కారు నడిపినట్టు తెలుస్తోందన్నారు. అయితే, ఆ కారు కొన్ని మీటర్ల వరకు ట్రాక్‌పై వెళ్లి తర్వాత పట్టాలపై ఇరుక్కుపోయిందని పోలీసులు తెలిపారు. దీంతో రైల్వే గేట్‌ కీపర్‌, స్థానికులు పోలీసులకు, సమీపంలోని రైల్వే స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో వారు అప్రమత్తమయ్యారు.హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. జులై 19న అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు, బెయిల్‌పై అతడిని విడుదల చేయడానికి ముందు కారును సీజ్‌ చేశారు. కారు పట్టాలపై ఉన్న సమయంలో రైళ్లు రాకపోవడంతో అతడి ప్రాణాలకు ముప్పు తప్పింది.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)