హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న ఆయన ఈ మధ్యే తన పదవికి రాజీనామా చేశారు. సంస్థకు విలువైన సేవలు అందించిన దీపక్ పరేఖ్ మొదటి ఆఫర్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తాజాగా విలీనం అయిన సంగతి తెలిసిందే. దీనికి ముందు హెచ్‌డిఎఫ్‌సి చైర్మన్‌గా ఉన్న దీపక్ పరేఖ్ రాజీనామా చేసి, ఉద్యోగులతో తన భావోద్వేగాల్ని పంచుకున్నారు. ఈ నేపథ్యంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో పరేఖ్ మొదటి ఆఫర్ లెటర్ అని పేర్కొంటూ ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. అది జూలై 19, 1978 నాటిదిగా తెలుస్తోంది. అందులో పరేఖ్ జీతం, అలవెన్స్‌ల వివరాలు ఉన్నాయి. అప్పట్లో డిప్యూటీ మేనేజర్ గా నియమించబడిన పరేఖ్‌కి రూ.3,500 జీతంతో పాటు రూ.500 అలవెన్స్‌గా నిర్ణయించారు. 45 సంవత్సరాల నాటి ఆ లెటర్‌లో 15 శాతం హౌసింగ్ రెంట్ అలవెన్స్, సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ 10 శాతం ఉన్నాయి. హెచ్‌డిఎఫ్‌సితో సుదీర్ఘంగా 45 ఏళ్లు పనిచేసిన పరేఖ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించిన వయసు పరిమితుల కారణంగా బోర్డులో పని చేయడం లేదు. ఆయన నాయకత్వంలో హెచ్‌డిఎఫ్‌సి తొమ్మిది మిలియన్లకు పైగా భారతీయులకు ఇంటి రుణాలు అందించింది. విలీనం జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. హెచ్‌డిఎఫ్‌సి దాని మాతృసంస్థ భారతదేశపు మొదటి హోమ్ ఫైనాన్స్ కంపెనీ - హెచ్‌డిఎఫ్‌సిని విలీనం చేసిన తరువాత ప్రపచంలోనే నాల్గవ అతి పెద్ద బ్యాంక్ గా అవతరించింది. https://t.me/offerbazaramzon
వైరల్ అవుతున్న దీపక్ పరేఖ్ ఆఫర్ లెటర్
July 06, 2023
0
Tags