రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఆగస్టు 7వ తేదీన కోర్టుకు హాజరు కావాలని ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు ఆ నోటీసుల్లో పేర్కొంది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఆశోక్ గెహ్లాట్‌పై వేసిన పరువు నష్టం దావా ఆధారంగా ఈ నోటీసులను ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు జారీ చేసింది. సుమారు 900 కోట్ల రూపాయలకు సంబంధించి ఆశోక్ గెహ్లాట్ చేసిన ఆరోపణలకు గానూ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ పిటిషన్ వేశారు. సంజీవని స్కామ్‌పై చేసిన వ్యాఖ్యలతో రాజస్థాన్ ముఖ్యమంత్రి ఆశోక్ గెహ్లాట్ తన పరువు తీశారంటూ కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కోర్టుకెక్కారు. అయితే.. నేరపూరిత పరువు నష్టం కేసులో ముఖ్యమంత్రికి నోటీసులు పంపాలా? వద్దా? అని తర్జనభర్జనలు చేసి.. ఆ ఉత్తర్వులను ఇదివరకే కోర్టు రిజర్వ్ చేసింది. ఇక ఇవాళ ప్రజాప్రతినిధుల న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ హజ్రీత్ సింగ్ జస్పాల్ ఇవాళ సీఎం ఆశోక్ గెహ్లాట్‌కు నోటీసులను జారీ చేశారు. https://t.me/offerbazaramzon
పరువు నష్టం దావా కేసులో ఆశోక్ గెహ్లాట్ కు ఢిల్లీ కోర్టు సమన్లు !
July 06, 2023
0
Tags