బీహార్‌లో పిడుగుపాటుకు ఒక్క రోజే 32 మంది మృతి

Telugu Lo Computer
0


బీహార్ లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల ధాటికి అనేక మంది చనిపోతున్నారు. అయితే, అనేక చోట్ల పిడుగులు పడుతున్నాయి. మంగళవారం ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా పడిన పిడుగుల్లో ఏకంగా 32 మంది చనిపోయారు. మొత్తం 14 జిల్లాల్లో ఈ మరణాలు సంభవించాయని బీహార్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. చనిపోయిన మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పరిహారం ప్రకటించారు. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.4 లక్షలు చొప్పున అందజేయాలని ఆదేశించారు. ఇదిలావుంటే బీహార్ రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం ఈశాన్య, నైరుతి బీహార్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)