ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసే ప్రయత్నాలు ప్రజల మధ్య చాలా వ్యత్యాసాలతో ఉన్న సంక్లిష్టమైన సమస్యను బహిరంగంగా సరళీకృతం చేయడమేనని ఆయన అన్నారు. మైనారిటీ హక్కులపై భారతదేశాన్ని విడదీయవచ్చంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్యల్ని గుర్తుచేస్తూ.. దేశంలో కుల, మత, లింగ భేదాలు ఉన్నాయని, అవి అన్నింటికీ దారి తీయగలవని అమర్త్యసేన్ తెలిపారు. ఒబామా వ్యాఖ్యలు తనకు సంతోషం కలిగించాయన్నారు. కానీ మనలో చాలా మంది వాటిని తప్పుబట్టారని సేన్ గుర్తుచేసారు. మరోవైపు విశ్వభారతి యూనివర్శిటీ విద్యార్థుల బృందాన్ని తన ఇల్లు 'ప్రతిచి'లో కలుసుకున్న సేన్..తన పూర్వీకుల ఆస్తి నుంచి తనను గెంటేయడానికి ప్రయత్నిస్తున్న విశ్వభారతి యూనివర్సిటీ యాజమాన్యం తీరును ప్రశ్నించారు. ఇంత మంది తమ వైఖరిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో యూనివర్సిటీ అధికారులు తమను తాము ప్రశ్నించుకోవాలన్నారు. https://t.me/offerbazaramzon
హిందూ దేశం కోసమే ఉమ్మడి పౌరస్మృతి !
July 06, 2023
0
దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి అమలు కోసం జరుగుతున్న ప్రయత్నాలపై నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ మండిపడ్డారు. కోల్ కతాలోని విశ్వభారతి విశ్వవిద్యాలయంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో అమర్త్యసేన్ కామన్ సివిల్ కోడ్ అమలు కోసం కేంద్రం చేస్తున్న ప్రయత్నాల్ని తీవ్రంగా తప్పుబట్టారు. హిందూ దేశం ఆలోచనలో భాగంగానే కేంద్రం సివిల్ కోడ్ తేవాలనుకుంటోందని, ఇదో తెలివి తక్కువ ఆలోచన అని సేన్ విమర్శించారు. యూనిఫాం సివిల్ కోడ్ (యుసిసి)ని అమలు చేసే ప్రయత్నాలను నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ తప్పుబట్టారు. ఇలాంటి ప్రయత్నాల వల్ల ఎవరికి లాభం అని ప్రశ్నించారు. ఈ కసరత్తు ఖచ్చితంగా 'హిందూ రాష్ట్ర' ఆలోచనతో ముడిపడి ఉందని, తెలివితక్కువ ఆలోచన కూడా అని అన్నారు. యూనిఫాం సివిల్ కోడ్ అమలులో ఇక జాప్యం జరగకూడదని కేంద్రం చెబుతున్నట్లుగా ఇవాళ పేపర్లలో చూశానన్నారు. ఇంత తెలివితక్కువ ఆలోచన ఎక్కడ నుండి వచ్చిందని సేన్ ప్రశ్నించారు. తాము వేలాది సంవత్సరాలుగా సివిల్ కోడ్ లేకుండానే ఉన్నామని, భవిష్యత్తులో కూడా అది లేకుండా బతకగలమని అమర్త్యసేన్ తెలిపారు. దేశం పురోగమించే ఏకైక మార్గం "హిందూ రాష్ట్రం" కాదని, ఈ ప్రశ్నలను విశాల దృక్పథంతో చూడాలని ప్రొఫెసర్ సేన్ అన్నారు. ఖచ్చితంగా హిందూ మతాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు.
Tags