మా కుటుంబం చీలిపోలేదు

Telugu Lo Computer
0


జిత్‌ పవార్‌ తిరుగుబాటుతో తమ కుటుంబం చీలిపోలేదని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సిపి) చీఫ్‌, సీనియర్‌ నేత శరద్‌ పవార్‌ సోమవారం పేర్కొన్నారు. శరద్‌ పవార్‌ సోదరుని కుమారుడైన అజిత్‌ పవార్‌ ఎన్‌సిపిపై తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. తన మద్దతుదారులైన ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో కలిసి ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వంలో చేరిపోయిన సంగతి తెలిసిందే. ఆదివారం రాజ్‌భవన్‌లో డిప్యూటీ సిఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఉదయం శరద్‌ పవార్‌ సతారాలోని స్వాతంత్య్ర సమరయోధుడు వైబి. చవాన్‌ స్మారకానికి నివాళులు అర్పించేందుకు బయలుదేరుతూ మీడియాతో మాట్లాడారు. అజిత్‌ పవార్‌ తిరుగుబాటుతో తమ కుటుంబం చీలిపోలేదని అన్నారు. కుటుంబంలో ఎలాంటి సమస్య లేదని, రాజకీయాలను ఇంట్లో చర్చించమని అన్నారు. ప్రతి ఒక్కరికీ వారి సొంత నిర్ణయాలను తీసుకునే స్వేచ్ఛ ఉందని అన్నారు. ఆదివారం నుండి ఎవరినీ సంప్రదిచలేదని, ఇప్పుడే సతారాకు బయలుదేరుతున్నట్లు తెలిపారు. అజిత్‌ పవార్‌పై తీసుకోనున్న చట్టపరమైన చర్యలపై ఎన్‌సిపి మహారాష్ట్ర చీఫ్‌, ఎమ్మెల్యే జయంత్‌ పాటిల్‌ మాట్లాడుతున్నారని, తన వద్ద ఎలాంటి సమాచారం లేదని అన్నారు. ప్రతిపక్ష పార్టీల సమావేశం బెంగళూరులో ఈనెల 13, 14 మధ్య ఉంటుందని అన్నారు. భవిష్యత్‌ కార్యాచరణపై అన్ని పార్టీలు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)