ధరణి పోర్టల్‌పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో ఉన్న మరో అయిదు మాడ్యుళ్లను మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. ఇందులో కొన్నింటిని కలెక్టర్ లాగిన్ చేసే విషయంలో అలాగే మరికొన్ని తహశీల్దార్ సమక్షంలో మార్పులు చేసే సదుపాయం తీసుకొచ్చారు. ఒకవేళ రైతుల భూమిలో కొంత భాగాన్ని అమ్మినా కూడా ఆ రైతు ఖాతాలో పూర్తి విస్తీర్ణం కొనసాగుతోంది. తాజాగా ఇచ్చిన అవకాశంతో విక్రయించిన భాగాన్ని గుర్తించి దాన్ని మార్పులు చేసేందుకు కలెక్టర్ లాగిన్‌లో సాధ్యపడుతుంది. అలాగే దీంతో పాటు సర్వే నంబర్లు కూడా ఇచ్చే అవకాశం ఉంది. భూవినియోగ విధానంలో మార్పు అయిన భూములు, ఇళ్ల స్థలాలకు సర్వే నెంబర్లు లేని వాటికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే నెంబర్ల లేని ప్రభుత్వ భూములకు కూడా వర్తిస్తుంది. అయితే పౌరుల లాగిన్‌లో ఈ అవకాశం కల్పించారు. మరో ముఖ్య విషయం ఏంటంటే ఒకవేళ ఆధార్ కార్డు నంబర్లు తప్పుగా అనుసంధానమైనట్లైతే వాటిని తహశీల్దార్ లాగిన్‌లో మార్పులు చేయవచ్చు. అలాగే ఆ భూమి దానికి సంబంధించిన యజమానిది కాకుండా ఒకవేళ పొరపాటుగా ఇతర ఆధార్ కార్డు నంబర్లు అనుసంధానమైనా కూడా మార్చుకునే అవకాశమిచ్చారు. పలు సంస్థలకు ఇచ్చిన పట్టాలకు సంబంధించి తప్పులు ఉంటే కూడా వాటిని కలెక్టర్‌ల లాగిన్‌లో మార్పులు చేసుకోవచ్చు. అలాగే నకిలీ సర్వే నంబర్లు ఉన్నా ఒకవేళ ఒకే నంబర్ రెండు సార్లు నమోదైనా వాటిలో మార్పులు చేసేందుకు తహశీల్దార్ లాగిన్‌లో సదుపాయం కల్పించారు. https://t.me/offerbazaramzon
ధరణి పోర్టల్‌లో మాడ్యూళ్ల మార్పుకు అవకాశం !
July 03, 2023
0
Tags