జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పూంచ్ సెక్టార్‌లో నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు కాల్చి చంపాయి. భారత సైన్యానికి చెందిన రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూకాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో ముష్కరులు హతమయ్యారు. సోమవారం మధ్యాహ్నం 11.30 గంటలకు ఈ ఆపరేషన్ ప్రారంభంకాగా, ఇందులో డ్రోన్లతో పాటు నైటి విజన్ నిఘా పరికరాలను కూడా ఉపయోగించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా మంగళవారం తెల్లవారుజామున మళ్లీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభంకాగా, భద్రతా బలగాలు, టెర్రరిస్టులమధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయని ఆర్మీ అధికారులు తెలిపారు. చనిపోయిన టెర్రరిస్టులను గుర్తించాల్సివుందని చెప్పారు. మరోవైపు, దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గాం, సోపియాన్, అనంతనాగ్ తదితర ప్రాంతాల్లో యాంటీ టెర్రర్ రెయిడ్స్ కొనసాగుతున్నాయి. ఒక బ్యాంకు ఏటీఎం గార్డు హత్యకు గురైన నేపథ్యంలో స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈ సోదాలు చేపట్టింది. https://t.me/offerbazaramzon
నలుగురు ఉగ్రవాదులు కాల్చివేత
July 18, 2023
0
Tags