కౌంట్‌డౌన్ ప్రారంభం !

Telugu Lo Computer
0


చంద్రయాన్-3 కౌంట్ డౌన్ ప్రారంభమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి శుక్రవారం టేకాఫ్‌ కానుంది. GSLV మార్క్ 3 (LVM 3) హెవీ-లిఫ్ట్ లాంచ్ వెహికల్‌ ద్వారా అంతరిక్ష నౌకను ప్రయోగించనున్నారు. మరోవైపు చంద్రయాన్-3 ప్రయోగాన్ని శ్రీహరికోటలోని వీక్షణ గ్యాలరీ నుంచి చూడాలని ఇస్రో ప్రజలను ఆహ్వానించింది. ప్రయోగించబోయే అంతరిక్ష నౌక కోసం భూమి నుండి చంద్రునికి ఉపరితలానికి చేరేందుకు ఒక నెల సమయం పడుతుందని, అంతా సవ్యంగా సాగితే ఆగస్ట్ 23న ల్యాండింగ్ అయ్యే అవకాశం ఉందని ఇస్రో డైరెక్టర్ ఎస్ సోమనాథ్ తెలిపారు. 2008లో ప్రయోగించిన చంద్రయాన్-1 మిషన్ చంద్రుని ఉపరితలంపై నీరు (H2O), హైడ్రాక్సిల్ (OH)ని గుర్తించింది. ధ్రువ ప్రాంతానికి గురించిన మెరుగైన డేటా అందించింది. చంద్రయాన్-2 మిషన్ 2019లో సాఫ్ట్ ల్యాండింగ్ సమయంలో సవాళ్లను ఎదుర్కొన్న తర్వాత ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చేపడుతున్న ప్రయోగం కావడంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)