బీహార్‌కు చెందిన మనీష్ పాఠక్ అనే న్యాయవాది టిఫిన్ కోసం తన తల్లితో కలసి హోటల్‌కు వెళ్లారు. రూ.140 వెచ్చించి స్పెషల్ మసాలా దోసెను పార్శిల్ తీసుకున్నారు. కానీ, ఇంటికి వెళ్లి చూసే అందులో సాంబార్‌లేదు కేవలం దోసె, చట్నీ మాత్రమే ఉంది. మనీష్ ఆ విషయాన్ని తెలపటానికి మరుసటి రోజు అదే రెస్టారెంట్‌కు వెళ్లారు. సాంబార్ ఇవ్వటం మరచిపోయారని ఆ వ్యక్తి చెబితే, 'ఏంటి, రూ.140తో హోటల్ మొత్తంగా కొంటావా' అంటూ మేనేజర్ ఎగతాళిగా మాట్లాడారు. దీంతో న్యాయవాది హోటల్ యాజమాన్యానికి నోటీసులు పంపారు. నోటీసులకు యాజమాన్యం స్పందించలేదు. దీంతో జిల్లా వినియోగదారుల కమిషన్‌కు ఆయన ఫిర్యాదు చేశారు. 11 నెలల విచారణ అనంతరం రెస్టారంట్‌దే తప్పని కోర్టు నిర్ధారించింది. అంతే కాదు రూ.3,500 జరిమానా విధించింది. బాధితులను మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసినందుకు రూ.2వేలు, లిటిగేషన్ ఛార్జీలు కింద వెయ్యి రూపాయలు ఫైన్ వేసింది. ఈ డబ్బును 45 రోజుల్లోగా చెల్లించాలని లేకపోతే 8శాతం వడ్డీని కలిపి చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. https://t.me/offerbazaramzon
మసాలా దోసెతో సాంబార్ ఇవ్వనందుకు రూ.3,500 జరిమానా !
July 13, 2023
0
Tags