బియ్యం ఎగుమతులపై నిషేధం ?

Telugu Lo Computer
0


బియ్యం ఎగుమతులను నిషేధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. స్థానికంగా బియ్యం ధరలు పెరగడంతో ఈ చర్య తీసుకోవాలని అనుకుంటోంది. ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతిదారుగా ఉన్న భారత దేశం ఎగుమతులపై నిషేధించాలని భావిస్తోంది. 'ఎల్ నినో' పరిస్థితి వాతావరణం, వర్షాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దేశీయంగా బియ్యం ధరలు పెరగకుండా, లభ్యత పెంచే విధంగా ఉండాలంటే నిషేధం ఒక్కటే మార్గమని అనుకుంటున్నారు. బాస్మతి కాకుండా మిగతా అన్ని రకాల బియ్యం ఎగుమతులని నిషేధించే అవకాశం ఉందని తెలుస్తోంది. దేశీయంగా ధరలు పెరగడం, అధిక ద్రవ్యోల్బణం ప్రమాదాన్ని నివారించాలని అనుకుంటున్నారు. నిషేధం అమలైతే భారతదేశం బియ్యం ఎగుమతుల్లో 80 శాతం ప్రభావితం అవుతుంది. ఈ చర్య ద్వారా దేశీయంగా బియ్యం ధరల్ని కంట్రోల చేయవచ్చు, దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా బియ్యం ధరలు పెరుగుతాయి. ప్రపంచం సగం జనాభాకు బియ్యమే ఆహార వనరుగా ఉంది. ప్రపంచ సరఫరాలో 90 శాతం ఆసియానే వినియోగిస్తోంది. భారతదేశం 100 కన్నా ఎక్కువ దేశాలకు బియ్యాన్ని ఎగుమతి చేస్తోంది. బెనిన్, చైనా, సెనెగల్, కోట్ డి ఐవోయిర్, టోగోలు భారత్ కు అతిపెద్ద కస్టమర్లుగా ఉన్నారు. నిషేధం వార్తల నేపధ్యంలో భారతీయ రైస్ మిల్లర్ల షేర్లు పడిపోయాయి. మరోవైపు ఇండోనేషియా, చైనా, ఫిలిప్పీన్స్ వంటి బియ్యం దిగుమతిదారులు దూకుడుగా బియ్యాన్ని నిల్వ చేస్తున్నారు. ఏడేళ్లలో మొదటిసారిగా పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నినో పరిస్థితులే ఇందుకు కారణం అని తెలుస్తోంది. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)