కేబీఆర్ పార్కులో మహిళా సినీ నిర్మాతకు వేధింపులు !

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని కేబీఆర్ పార్కులో జులై 9న ఓ మహిళా సినీ నిర్మాత వాకింగ్ కు వచ్చారు. ఆమె వాకింగ్ చేస్తుండగా  ఓ వ్యక్తి ఆమె ముందుకు వచ్చి ఆమెతో శృంగార హావభావాలు ప్రదర్శించాడు. దీంతో ఆమె అతన్ని దాటుకుని వెళ్లింది. అయితే అతను మళ్లీ వచ్చి మహిళా నిర్మాతను ఫొటో తీయడానికి యత్నించాడు. దీనిపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. గంట వ్యవధిలో ఆ వ్యక్తి మహిళా నిర్మాతను మూడు సార్లు వేధించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆమె వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. నిందితుడి కారు నంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కారు ఎటు వెళ్లిందో సీసీ కెమెరాల్లో పరిశీలిస్తున్నారు. అయితే ఈ ఘటన జరిగినప్పుడు పార్కులో ఎవరైనా ఉన్నారా, లేరా తెలియరాలేదు.  వేధింపులకు గురైన సినీ మహిళా నిర్మాత ఎవరో పోలీసులు బయటకి చెప్పలేదు. ఈ కేసును సీరియస్ తీసుకున్న పోలీసులు నిందితుడి కోసం వేట కొనసాగిస్తున్నారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)