స్వీపర్‌కు పురుడు పోసిన రైల్వే పోలీసులు

Telugu Lo Computer
0


రాజస్థాన్ లోని అజ్ మేర్ రైల్వే స్టేషన్ లో పూజా అనే మహిళ స్వీపర్ గా పనిచేస్తుంది. పూజా నిండు గర్భిణి. నిన్న కూడా పనికి వచ్చింది. ఆమెకు పనిచేస్తే తప్ప పూటగడవని పరిస్థితి. ఈ కారణంతోనే నిండు గర్భంతో ఉన్నప్పటికీ రైల్వే స్టేషన్ కి వచ్చి పనిచేసుకుంటుంది. అంతలోనే ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి. సాధారణంగా మహిళకు పురిటినొప్పులు, బిడ్డకు జన్మనివ్వడం అంటే పునర్జన్మతో సమానం. ఆ మహిళ బాధ తెలుసుకున్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ వీరేంద్ర సింగ్ ఆర్పీఎఫ్ ఏఎస్ఐ ప్రేమ్ రావు కి సమాచారం అందించారు. కానిస్టేబుల్ వీరేంద్ర సింగ్ అందించిన సమాచారంతో ప్రేమ్ రావు వెంటనే మహిళా కానిస్టేబుల్స్ అయిన సావిత్రి ఫగేడియా, హంస కుమారి, లక్ష్మీ వర్మలను పంపించారు. అప్పటికే పూజ తీవ్రమైన ఇబ్బంది పడుతుంది. ఆమెను ఆసుపత్రికి తీసుకు వెళ్లే సమయం కూడా లేదు. దీంతో వారే ప్రసవం చేయాలని నిర్ణయించుకున్నారు. కానిస్టేబుల్స్ అక్కడే ఓ దుప్పటి చుట్టూ అడ్డంగా పెట్టి, పూజకు ధైర్యం చెబుతూ ప్రసవం చేశారు. అదృష్టం కొద్ది తల్లీ బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. ప్రసవం తర్వాత పూజా, పురిటి బిడ్డను స్థానిక సాటిలైట్ ఆస్పత్రికి తరలించారు. తల్లీ బిడ్డలకు ప్రథమ చికిత్స చేసిన డాక్టర్లు ఇద్దరూ క్షేమంగా ఉన్నారని తెలిపారు. కష్టకాలంలో ఆదుకొని తనకు పునర్జన్మనిచ్చి కానిస్టేబుల్స్ కి పూజ ధన్యవాదాలు తెలిపింది. కానిస్టేబుల్స్ చేసి గొప్పపనికి ఉన్నతాధికారులు ప్రశంసలు కురిపించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)