పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లా జలాల్‌చక్క గ్రామంలో వీర్‌సింగ్ తన కుమారుడు అమర్‌సింగ్‌తో పాటు ఉంటున్నాడు.వారి ఇంటిలోని ఏసీ సరైన చల్లదనాన్ని అందించడం లేదు. దీంతో కుమారుడు ఏసీకి మరమ్మతు చేయించాలని తండ్రికి చెప్పాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వివాదం జరిగింది. ఏసీ కూలింగ్ విషయమై జరిగిన వివాదంలో కుమారుడు తండ్రిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. తూటాలు ఆ వృద్ధుడి రెండు కాళ్లలోకి దూసుకుపోయాయి. దీనిని గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మరింత మెరుగైన వైద్యం కోసం బాధితుడిని అమృత్‌సర్‌లోని ఒక ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తండ్రి పోలీసులతో మాట్లాడుతూ..' నా కొడుకు మద్యం మత్తులో ఉన్నాడు. వాడు ఆగ్రహంతో లైసెన్స్ కలిగిన తుపాకీతో నాపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నా రెండు కాళ్లలోకి బుల్లెట్లు దిగాయి. వాడు మద్యం మత్తులో తప్పు చేశాడు. నేను వాడికి తండ్రిని అయిన కారణంగా అతనిని అరెస్టు చేయించి, తప్పు చేయలనుకోవడం లేదు. నా కుమారునిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని వేడుకుంటున్నాను' అని అన్నాడు. ఈ ఉదంతంపై పోలీసు అధికారి బల్విందర్ సింగ్ మాట్లాడుతూ సమాచారం అందగానే తాము సంఘటనా స్థలానికి చేరుకున్నామని అన్నారు. బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందున్నాడు. ఘటనపై తమకు ఫిర్యాదు చేసేందుకు నిరాకరిస్తున్నాడు. ఒకవేళ అతను కుమారునిపై ఫిర్యాదు చేస్తే చర్యలు చేపడతామన్నారు.
ఏసీ కూలింగ్ విషయమై తండ్రిని తుపాకీతో కాల్చిన తనయుడు !
June 26, 2023
0
Tags